దేశవ్యాప్తంగా అనేక మౌలిక వసతుల ప్రాజెక్టుల్లో కరోనా కారణంగా జాప్యం జరుగుతోందని కేంద్ర గణాంకాల మంత్రిత్వశాఖ ఓ నివేదికలో వెల్లడించింది. రూ.150 కోట్లు, అంతకంటే ఎక్కువ ఖర్చుతో నిర్మిస్తున్న సుమారు 401 ప్రాజెక్టులకు వైరస్ సంక్షోభం ప్రభావం చూపిందని తెలిపింది.
ఈ కారణంగా మెుత్తం 1692 ప్రాజెక్టుల్లో 401 ప్రాజెక్టుల నిర్మాణానికి నిర్దేశించిన ఖర్చు పెరుగుతోందని స్పష్టం చేసిన మంత్రిత్వశాఖ.. మరో 552 ప్రాజెక్టులు పనులు ఆలస్యం కానున్నాయని పేర్కొంది. ఫలితంగా రూ. 4 లక్షల కోట్లు అదనపు ఖర్చవుతోందని చెప్పింది.