కరోనా వల్ల నెలకొన్న భయాలు, లాక్డౌన్ వంటి ఆంక్షలతో రెస్టారెంట్ల వ్యాపారాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అన్‌లాక్ తర్వత.. రెస్టారెంట్లపై ఆధారపడి ప్రధానంగా సేవలందించే ఆన్లైన్ ఫుడ్ డెలివరీ వ్యాపారాలు.. నెమ్మదిగా తేరుకుంటున్నాయి. అయితే రెస్టారెంట్ల డైనింగ్ వ్యాపారాలు మాత్రం ఇప్పట్లో కోలుకునేలా కనిపించడం లేదు. ప్రముఖ ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో చేసిన తాజా సర్వేలో ఈ విషయం తెలిసింది.
దేశంలో 40% రెస్టారెంట్లు శాశ్వతంగా మూత! - కరోనాతో 40 శాతం రెస్టారెంట్లు శాస్వతంగా మూత
కొవిడ్‌తో కుదేలైన రెస్టారెంట్ల వ్యాపారాలు.. కరోనా ముందున్న స్థాయికి చేరేందుకు ఇంకా సమయం పట్టేలా కనిపిస్తోంది. కరోనా సంక్షోభంతో ఇప్పటికే 10 శాతం రెస్టారెంట్లు శాశ్వతంగా ముతపడ్డాయి. మరో 30 శాతం రెస్టారెంట్లు మూతపడొచ్చని.. ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో సర్వేలో తెలిసింది.
రెస్టారెట్ల వ్యాపారాలపై కరోనా ప్రభావం
సర్వేలో ముఖ్యాంశాలు..
- దేశంలో కొవిడ్-19 ముందుతో పోలిస్తే ప్రస్తుతం 10 శాతం రెస్టారెంట్లు మాత్రమే కార్యకలాపాలు పూర్తిగా ప్రారంభించాయి.
- 70 శాతం రెస్టారెంట్లు ఫుడ్‌డెలివరీ సేవలు ప్రారంభించాయి. వీటిలో 5 శాతం గతంలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీకి మొగ్గుచూపని రెస్టారెంట్లు ఉన్నాయి.
- దేశవ్యాప్తంగా 83 శాతం రెస్టారెంట్ల డైనింగ్ వ్యాపారాలు ప్రారంభం కాలేదు. వీటిలో 10 శాతం రెస్టారెంట్లు ఇప్పటికే పూర్తిగా మూతపడ్డాయి.
- మిగతా 73 శాతం రెస్టారెంట్లలోనూ.. 30 శాతం పూర్తిగా మూతపడొచ్చు. పరిస్థితులు మెరుగైతే 43 శాతం రెస్టారెంట్ల డైనింగ్ సేవలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
- లాక్డౌన్ ఆంక్షలు ఎత్తేసినా.. పట్టణాల్లో 17 శాతం రెస్టారెంట్లు మాత్రమే డైనింగ్ సదుపాయాలను ప్రారంభించాయి. అవి కూడా తక్కువ సామర్థ్యంతో పని చేస్తున్నాయి.
- ప్రస్తుత పరిస్థితుల్లో రెస్టారెంట్లలో డైనింగ్కన్నా.. ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ ఇచ్చేందుకే వినియోగదారులు మొగ్గుచూపుతున్నారు.
- ఆన్లైన్ ఫుడ్ డెలివరీ వ్యాపారాలు 75-80 శాతం వరకు రికవరీ సాధించాయి. మరో 2-3 నెలల్లో కరోనాకు మందున్న స్థాయికి ఆన్లైన్ ఫుడ్‌డెలివరీ వ్యాపారాలు రికవరీ సాధిస్తాయని అంచనా.
- కార్యాలయాలు ఉండే ప్రాంతాలతో పోలిస్తే నివాసిత ప్రాంతాల్లో ఫుడ్ డెలివరీ వ్యాపారాలు ఎక్కువగా రికవరీ అయ్యాయి. వర్క్ ఫ్రం హోం వంటివి ఇందుకు కారణం.
- లాక్డౌన్ ప్రారంభమైనప్పటినుంచి దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు జొమాటో 7 కోట్ల ఆన్లైన్ ఫుడ్ ఆర్డర్లు డెలివరీ చేసింది.
ఇదీ చూడండి:భారత మార్కెట్‌కు హార్లీ డేవిడ్సన్ గుడ్‌బై!
TAGGED:
restaurant industry in India