తెలంగాణ

telangana

ETV Bharat / business

ఏ దేశంలో తయారైందో తెలుసుకున్నాకే..! - కొనే వస్తువుపై తయారీ దేశం పేరు ఉండాల్సిందే

ఈ కామర్స్ వినియోగదారుల్లో తాము కొనే వస్తువుల మూలాలు తెలపాలనే డిమాండ్ పెరుగుతోంది. ఓ ప్రముఖ సంస్థ చేసిన సర్వేలో 37 శాతం మంది తాము కొనే వస్తువు ఏ దేశంలో తయారైందో తెలుసుకోవాలనుకుంటున్నట్లు వెల్లడైంది. ఈ సర్వేలో తేలిన మరిన్ని విషయాలు ఇలా ఉన్నాయి.

country of origin is new trend in online Shopping
ఆన్​లైన్ షాపింగ్​లో మారుతున్న ట్రెండు

By

Published : Jul 4, 2020, 5:12 PM IST

Updated : Jul 4, 2020, 10:38 PM IST

ఆన్​లైన్​ షాపింగ్​లో కొనే వస్తువులపై అది ఏ దేశానికి చెందినదో తెలుసుకునేలా.. నిబంధనను విధించాలని కేంద్రం భావిస్తోంది. ఈ తరుణంలో ఇదే అంశం గురించి ఆన్​లైన్ షాపింగ్ చేసేవారిపై​ 'లోకల్ సర్కిల్స్​' అనే సంస్థ ఓ సర్వే నిర్వహించింది.

సర్వేలో పాల్గొన్న వారిలో 37 శాతం మంది కొనే వస్తువు ఏ దేశానికి చెందినదో తెలుసుకోవాలని భావిస్తున్నట్లు వెల్లడైంది.

చైనాతో సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో.. ఈ కామర్స్ ప్లాట్​ఫామ్​లలో విక్రయించే వస్తువులపై వాటి మూలాలు (కంట్రీ ఆఫ్ ఆరిజిన్) తెలపాలనే డిమాండ్​కు మద్దతు పెరిగింది. దీనిపై డిపార్ట్​మెంట్ ఆఫ్ ప్రమోషన్స్​ ఆఫ్ ఇండస్ట్రీ అండ్​ ఇంటర్నల్ ట్రేడ్​ (డీపీఐఐటీ).. ఈ కామర్స్ సంస్థలతో చర్చించింది. దీనిపై ఆయా సంస్థలు కూడా సుముఖత వ్యక్తం చేశాయి.

సర్వేలోని ముఖ్యాంశాలు..

  • సర్వేలో పాల్గొన్న 83 శాతం మంది రేటింగ్, రివ్యూలు చూస్తున్నట్లు తెలిపారు.
  • 82 శాతం మంది ఎంఆర్​పీ, డిస్కౌంట్​ల సమాచారం కోసం వెతుకుతున్నట్లు సర్వేలో తేలింది.
  • తినే ఉత్పత్తులైతే ఎక్స్​పైరీ తేదీలను చూసి కొంటున్నట్లు 62 శాతం మంది చెప్పారు.
  • 17 శాతం మంది ఈ కామర్స్ సైట్లలో కొనే వస్తువులకు సంబంధించిన పూర్తి సమాచారం ప్రోడక్ట్ డిస్క్రిప్షన్​లో (టెక్ట్స్​ రూపంలో) ఉండాలని కోరారు.
  • 46 శాతం మంది వరకు ఆయా ఉత్పత్తులకు సంబంధించిన అసలైన ప్యాకింగ్ ఫోటో సహా, ఎంఆర్​పీ ట్యాగ్​లను స్పష్టంగా కనిపించేలా ఉంచాలని కోరుతున్నట్లు సర్వే పేర్కొంది.
  • 37 శాతం మంది ప్రస్తుతం ఇస్తున్న సమాచారం తమకు సరిపోతుందని చెప్పుకొచ్చారు.

ఇదీ చూడండి:దుకాణదారులు లేని షాపులు.. ఆచరణ సాధ్యమేనా?

Last Updated : Jul 4, 2020, 10:38 PM IST

ABOUT THE AUTHOR

...view details