పెట్రోల్ బాదుడు కొనసాగుతోంది. వరుసగా పదో రోజూ ఇంధన ధరలు భగ్గుమన్నాయి. గురువారం పెట్రోల్‌పై 34 పైసలు, డీజిల్‌పై 32 పైసల చొప్పున పెరిగాయి. దీంతో ప్రస్తుతం దిల్లీలో లీటరు పెట్రోలు రూ.89.88 ఉండగా.. లీటరు డీజిల్ రూ. 80.27గా కొనసాగుతోంది. కొత్త సంవత్సరంలో ఇప్పటి వరకు 12 సార్లు చమురు ధరలు పెరిగాయి. వీటితో పాటు ఇటీవల వంట గ్యాస్ ధరలు కూడా పెరగడం సామాన్యుడి నెత్తిమీద భారం పడినట్లు అయింది.
ఆగని పెట్రో బాదుడు- పదో రోజూ ధరల పెంపు - ఇంధన ధరలు
పెట్రోల్, డీజిల్ ధరలు పెంపు వరుసగా పదో రోజూ కొనసాగింది. పెట్రోల్‌పై 34 పైసలు, డీజిల్‌పై 32 పైసలు చొప్పున పెరిగాయి.
వరుసగా పదోరోజూ పెట్రో మంట
ధరలు అదుపులేకుండా ఇలా పెరుగుతుండటంపై ప్రజల్లో ఆందోళన నెలకొంది. ధరల పెంపుపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. కరోనాతో ఉపాధి కోల్పోయిన ప్రజలకు.. పెరిగిన ధరలు భారంగా మారాయని పేర్కొన్నాయి. గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు సామాన్యులకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. అయితే ఈ బాదుడుకు కారణం గత ప్రభుత్వాల నిర్లక్ష్యమే కారణమనికేంద్రం పేర్కొనడం గమనార్హం.
ఇదీ చదవండి :2-3 ఏళ్లలో తక్కువ ధరకే విద్యుత్ కారు
Last Updated : Feb 18, 2021, 9:06 AM IST