ఇప్పటి వరకు పట్టణ ప్రాంతీయులే బంగారంపై పెట్టుబడి పెట్టటం కనిపించేదని, ఇప్పుడు గ్రామీణులూ ముందుకు వస్తున్నారని వివరించింది ప్రపంచ స్వర్ణ మండలి(డబ్ల్యూజీసీ). పుత్తడిపై పెట్టుబడులు పెట్టేందుకు రిటైల్ మదుపరులు ఆసక్తి చూపుతున్నట్లు తెలిపింది. రిటైల్ మదుపరుల్లో ఇంతవరకు బంగారం పెట్టుబడి సాధనాల వైపు చూడని 29 శాతం మంది ఇప్పుడు వీటిపై ఆసక్తి చూపుతున్నట్లు 'ఇండియా రిటైల్ ఇన్వెస్టర్ ఇన్‌సైట్స్' పేరుతో విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది డబ్ల్యూజీసీ.
బంగారంపై పెట్టుబడులకు రిటైల్ మదుపరులు సై - బంగారం పెట్టుబడులు
బంగారంపై పెట్టుబడులు పెట్టేందుకు రిటైల్ మదుపరులు ఆసక్తి చూపుతున్నట్లు ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) పేర్కొంది. గ్రామీణ ప్రాంతాలకు చెందిన 37 శాతం మంది రిటైల్ మదుపరులు సమీప భవిష్యత్తులో బంగారం పెట్టుబడి సాధనాల్లో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నట్లు 'ఇండియా రిటైల్ ఇన్వెస్టర్ ఇన్‌సైట్స్' పేరుతో విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది.
బంగారంపై పెట్టుబడులకు రిటైల్ మదుపరులు సై
బంగారం పెట్టుబడి సాధనాలు బాగా అందుబాటులోకి రావటం, ఈ అవకాశాలపై రిటైల్ మదుపరుల్లో అవగాహన పెరగటం దీనికి ప్రధాన కారణంగా విశ్లేషించింది. డబ్ల్యూజీసీ అధ్యయనం ప్రకారం..
- పట్టణ మదుపరుల్లో 76 శాతం మందికి ఇప్పటికే బంగారంపైనా పెట్టుబడులు ఉన్నాయి. మరో 21 శాతం మంది సమీప భవిష్యత్తులో పెట్టుబడి పెట్టే ఆలోచన చేస్తున్నారు.
- గ్రామీణ ప్రాంతాలకు చెందిన 37 శాతం మంది రిటైల్ మదుపరులు సమీప భవిష్యత్తులో బంగారం పెట్టుబడి సాధనాల్లో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారు.
- బంగారం పెట్టుబడి సాధనాలపై రిటైల్ మదుపరులు ఇప్పటి వరకు పెద్దగా మొగ్గు చూపకపోడానికి వాటిపై అవగాహన, విశ్వాసం లేకపోవటం ప్రధాన కారణాలు.
- బంగారంపై పెట్టుబడులను సులభతరం చేయడంలో సాంకేతిక పరిజ్ఞానం కీలక పాత్ర పోషిస్తుందని, తద్వారా ఎక్కువ మంది రిటైల్ మదుపరులకు దగ్గరయ్యే అవకాశం ఏర్పడుతుందని ఈ నివేదిక విశ్లేషించింది.