తెలంగాణ

telangana

ETV Bharat / business

'కరోనా ఎక్కువ కాలం ఉంటే.. ఆ సంస్థల పని అంతే' - అంకుర సంస్థలు

కరోనా వైరస్​ ఎక్కువ రోజులు ఉంటే దేశంలోని 25శాతం అంకుర సంస్థలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటాయని ప్రముఖ ఐటీరంగ నిపుణులు సేనాపతి గోపాల క్రిష్ణన్​ అభిప్రాయపడ్డారు. అదనంగా పెట్టుబడులు వస్తేనే వీటిలోని కొన్ని సంస్థలు క్లిష్ట పరిస్థితుల నుంచి బయటపడే అవకాశముందన్నారు.

25% of Indian startups in serious trouble if COVID-19 persists for long: Expert
'కరోనా ఎక్కువ కాలం ఉంటే.. ఆ సంస్థల పని అంతే'

By

Published : May 10, 2020, 8:25 PM IST

కరోనా వైరస్​ మహమ్మారితో భారత్​ లాక్​డౌన్​లోకి జారుకుంది. అనేక కార్యకలాపాలు మూతపడ్డాయి. అయితే వైరస్​ ప్రభావం ఎక్కువ కాలం ఉంటే.. దేశంలోని 25శాతం అంకుర పరిశ్రమలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోక తప్పదని ప్రముఖ ఐటీ రంగ నిపుణుడు, కాన్​ఫెడరేషన్​ ఆఫ్​ ఇండియన్​ ఇండస్ట్రీ మాజీ అధ్యక్షుడు సేనాపతి గోపాల క్రిష్ణన్​ అభిప్రాయపడ్డారు.

"25శాతం అంకుర సంస్థలు ప్రమాదంలో పడతాయని అనుకుంటున్నా. వారు కోలుకోవడానికి 6 నెలల సమయం మాత్రమే ఉంది. ఈ పరిస్థితుల్లో అది సాధ్యం కాదని అనిపిస్తోంది. అదనపు పెట్టుబడులు అందితే ఈ సంస్థలు ఊపిరి పీల్చుకోవచ్చు. లేకపోతే విఫలమయినట్టే. పెట్టుబడులు అందినప్పటికీ కొన్ని కోలుకోవడం కష్టమే."

- సేనాపతి గోపాల క్రిష్ణన్​, కాన్​ఫెడరేషన్​ ఆఫ్​ ఇండియన్​ ఇండస్ట్రీ మాజీ అధ్యక్షుడు.

కరోనా వైరస్​ ప్రభావం ఎక్కువ కాలం ఉంటే... మిగిలిన 75శాతం సంస్థలు కూడా గడ్డు పరిస్థితులు ఎదుర్కోక తప్పదని అభిప్రయపడ్డారు సేనాపతి. బ్యాంకులు, ప్రభుత్వం, పెట్టుబడిదారులు వీరికి సహాయం చేయకపోతే పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందన్నారు.

అయితే తమ వద్ద ఉన్న వనరులను వివిధ రకాలుగా ఉపయోగించుకోవాలని అభిప్రాయపడ్డారు సేనాపతి.

"ఈ-కామర్స్​ సేవలు కొన్ని ప్రాంతాల్లో ప్రారంభమయ్యాయి. ఫుడ్​ డెలివరీలు కూడా జరుగుతున్నాయి. రవాణాపై నిషేధం ఉన్న ప్రాంతాల్లో ప్యాసింజర్లు వినియోగించని ట్యాక్సీలను ఈ ఫుడ్​ డెలివరీ కోసం, సరకు రవాణా కోసం వినియోగించాలి."

--- - సేనాపతి గోపాల క్రిష్ణన్​, కాన్​ఫెడరేషన్​ ఆఫ్​ ఇండియన్​ ఇండస్ట్రీ మాజీ అధ్యక్షుడు.

రవాణా రంగంలోని అంకుర సంస్థలు తమ కార్యకలాపాలు ప్రారంభించడానికి ఆశిస్తున్నట్టు ఈ-కామర్స్​ అండ్​ కన్జ్యూమర్​ ఇంటర్నెట్​ జాతీయ నేత, భాగస్వామి అంకుర్​ పాహ్వ పేర్కొన్నారు. అయితే పరిశుభ్రతకు ఎంతో ప్రాధాన్యమివ్వాలని తెలిపారి.

బీ2సీ(బిజినెస్​ టు కన్జ్యూమర్​​) కంపెనీలకు డిమాండ్​ పెరగాలంటే కొంత కాలం వేచి చూడాలని అభిప్రాయపడ్డారు అంకుర్​.

ABOUT THE AUTHOR

...view details