లాక్డౌన్ సడలింపుల తర్వాత జులైలో దేశీయంగా 21.07 కోట్ల మంది విమానాల్లో ప్రయాణించారు. పౌర విమానయాన నియంత్రణ సంస్థ (డీజీసీఏ) ఈ విషయాన్ని వెల్లడించింది. 2019 జులైలో పోలిస్తే ఈ మొత్తం 82.3 శాతం తక్కువని పేర్కొంది.
అయితే ఇదే సంవత్సరం జూన్‌లో ప్రయాణించిన 19.84 లక్షల మంది ప్రయాణికులతో పోలిస్తే.. జులైలో ప్రయాణికుల సంఖ్య పెరగటం గమనార్హం.
దేశవ్యాప్తంగా ఆరు ప్రధాన విమానయాన సంస్థల విమానాల్లో ఆక్యుపెన్సీ రేటు 50 నుంచి 60 శాతంగా ఉన్నట్లు డీజీసీఏ తెలిపింది.
కంపెనీల పరంగా చూస్తే.. స్పైస్‌జెట్ ఆక్యుపెన్సీ రేటు జులైలో అత్యధికంగా 70 శాతంగా నమోదైంది. ఎయిర్ ఏషియా ఆక్యుపెన్సీ రేటు 45.5 శాతంగా ఉంది.