తెలంగాణ

telangana

ETV Bharat / business

ఉద్యోగం చేయకుండానే లక్షల జీతం.. ఎలా?

ఏ సంస్థలోనూ ఉద్యోగం చేయకుండానే డబ్బులు సంపాదించవచ్చా? రానున్న రోజుల్లో అది ఒక కేరీర్​గా మారనుందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. అందుకు ఈ అమ్మాయే నిదర్శనం. మైక్రోసాఫ్ట్​లో ఉద్యోగం చేయకుండానే.. సంస్థ నుంచి 30వేల డాలర్లు(రూ.22 లక్షలు) పారితోషికం తీసుకుంది. మరి ఆ యువతి చేసిన పనేంటి? అంత మొత్తం ఎందుకు చెల్లించారు?

Security Bug
సాఫ్ట్​వేర్​ బగ్​

By

Published : Jul 1, 2021, 1:34 PM IST

Updated : Jul 1, 2021, 1:47 PM IST

సెక్యూరిటీ, టెక్​ సిస్టమ్స్​లో ప్రమాదకర బగ్స్​ను​ గుర్తించి డబ్బులు సంపాదించటం అనేది ప్రస్తుతం ఒక కేరీర్​గా మారుతోంది. దీని ద్వారా ప్రోత్సాహకాలతో పాటు మంచి గుర్తింపు వస్తుండటమూ ఇందుకు కారణంగా తెలుస్తోంది. సాంకేతిక రంగంలో నిపుణులైనవారు ఈవైపుగా తమ కేరీర్​ను మలుచుకునేందుకే మొగ్గుచూపుతున్నారు. అందుకు ఉదాహరణే అదితి సింగ్​ అనే యువతి.

సైబర్​ సెక్యూరిటీ నిపుణురాలుగా వ్యవహరిస్తున్న అదితి సింగ్​.. ఇటీవల మైక్రోసాఫ్ట్​ అజూర్​ క్లౌడ్​ ప్లాట్​ఫాంలో బగ్​ను కనుగొని.. గుర్తింపు తెచ్చుకున్నారు. రిమోట్​ కోడ్​ ఎగ్జిక్యూషన్​(ఆర్​సీఈ) అనే బగ్​ను గుర్తించి.. ఆ సంస్థ​ ఇంజినీర్లకు తెలియజేశారు. కొన్ని రోజుల తర్వాత తన ఫిర్యాదుకు మైక్రోసాఫ్ట్​ నుంచి స్పందన వచ్చింది. సింగ్​ గుర్తించినది సరైనదేనని తెలియజేశారు ఇంజినీర్లు. బగ్​ను గుర్తించినందుకుగానూ ప్రోత్సాహకం కింద 30వేల డాలర్లు(రూ.22 లక్షలు) అందిస్తున్నట్లు తెలిపారు. తాను సాధించిన ఈ విజయాన్ని లింక్డ్​ ఇన్​ ద్వారా తెలియజేశారు అదితి. పెద్ద ఎత్తున ప్రశంసలు అందుకున్నారు.

బగ్​ సమస్య పరిష్కారమైనట్లు అదితి తెలిపారు. ఈ విజయంతో తన కేరీర్​లో స్థిరపడిననట్లు అనిపిస్తోందని చెప్పారు. కుమార్తె విజయంపై ఆమె తల్లిదండ్రులూ సంతోషం వ్యక్తం చేశారు.

అదితి సింగ్​

రెండు నెలల క్రితమే అదితి ఫేస్​బుక్​లో ఇలాంటి బగ్​నే కనుగొని.. సుమారు రూ.5.5 లక్షలు పారితోషికం అందుకోవడం విశేషం.

మెడిసిన్​ నుంచి హ్యాకింగ్ వైపు...

అదితి సింగ్​ తొలుత ఒక మెడికల్​ విద్యార్థిని. అయితే.. కొద్దిరోజులకే తనకు ఇష్టమైన సైన్స్​ రంగంలోకి మారారు. బగ్​ను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. ఏడాదిలోపే మైక్రోసాఫ్ట్​లో బగ్​ గుర్తించి మంచి రివార్డు పొందారు సింగ్​. బగ్​లను గుర్తించేందుకు సైబర్​ సెక్యూరిటీలో నిపుణులు, అత్యంత నైపుణ్యాలు కలిగిన ఐఐటీయన్​ కావాల్సిన అవసరం లేదని, సైబర్​ సెక్యూరిటీ, ఎథికల్​ హ్యాకింగ్​ కోర్సుల్లో సర్టిఫికెట్​తో పాటు ఇంటర్​నెట్​పై అవగాహన ఉంటే సరిపోతుందని నమ్ముతానని చెప్పారు సింగ్​.

బగ్​ గుర్తించిన యువకులు..

ఇన్​స్టాగ్రామ్​లో బగ్​ను గుర్తించి ఫేస్​బుక్​ నుంచి రూ.22 లక్షల రివార్డు పొందాడు మాహారాష్ట్ర సోలాపుర్​కు చెందిన 21 ఏళ్ల మయూర్​ ఫర్తాడే.

మణిపుర్​ రాష్ట్రానికి చెందిన 2 ఏళ్ల సివిల్​ ఇంజినీర్​ జోనెల్​ సౌగయ్​జమ్​.. వాట్సప్​లో బగ్​ను గుర్తించి ఫేస్​బుక్​ నుంచి రూ.3.47 లక్షల పారితోషికం పొందాడు. అలాగే.. ఫేస్​బుక్​ హాల్​ ఆఫ్​ ఫేమ్​-2019లో చోటు దక్కింది.

ఇవీ చూడండి:క్రోమ్ వాడుతున్నారా.. ఈ బగ్​తో జాగ్రత్త

Last Updated : Jul 1, 2021, 1:47 PM IST

ABOUT THE AUTHOR

...view details