దేశవ్యాప్తంగా మెజారిటీ(ప్రతి మూడు కుటుంబాల్లో రెండు) ప్రజలకు ఈ దీపావళికి(diwali 2021 date in india) అసలు టపాసులు పేల్చే ఆలోచనే లేనట్టు ఓ సర్వేలో తేలింది. ఇందుకు.. నిషేధంతో(crackers ban in india) టపాసులు అందుబాటులో లేకపోవడం, కాలుష్యం సహా అనేక కారణాలున్నట్టు సర్వే స్పష్టం చేసింది.
దేశవ్యాప్తంగా 371 జిల్లాల్లోని 28వేలమందిపై లోకల్‌సర్కిల్స్ అనే సంస్థ ఈ సర్వే(local circles survey) నిర్వహించింది. వీరిలో 63శాతం మంది పురుషులు కాగా.. 37శాతం మంది మహిళలు. 41శాతం మంది టైర్-1, 33శాతం మంది టైర్-2 నగరాలకు చెందిన వారున్నారు.
"ఈ దీపావళికి టపాసులు కాల్చుతున్నారా? అని సర్వేలో మేము ప్రశ్నించాము. 45శాతం మంది ఎలాంటి టపాసులు కాల్చమని చెప్పారు. 15శాతం మంది హరిత టపాసులు కాలుస్తామన్నారు. 11శాతం మంది.. టపాసులు కాకుండా, చిచ్చుబుడ్లు వంటివి కాలుస్తామని సమాధానమిచ్చారు. కేవలం 6శాతం మంది.. ఎప్పుడూ కాల్చే విధంగానే ఈసారీ టపాసులు కాలుస్తామని చెప్పారు. నిషేధం అమల్లో ఉండటం వల్ల తమకు వేరే ఆప్షన్ లేదని 5శాతం మంది అభిప్రాయపడ్డారు."