పార్లర్లు లేదా అలాంటి విక్రయ కేంద్రాల్లో అమ్మే ఐస్‌క్రీమ్‌లపై 18 శాతం (Ice Cream GST rate) వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) చెల్లించాల్సి ఉంటుందని కేంద్ర పరోక్ష పన్నులు, సుంకాల మండలి (సీబీఐసీ) వెల్లడించింది. (Ice Cream GST rate in India) గత నెల 17న జరిగిన 45వ జీఎస్‌టీ మండలి సమావేశంలో 21 వస్తు, సేవల పన్ను రేట్ల విషయంలో తీసుకున్న నిర్ణయాలపై అటు వాణిజ్య, పరిశ్రమ వర్గాల నుంచి వస్తున్న సందేహాలు నివృత్తి చేసేలా సీబీఐసీ 2 సర్క్యులర్లను విడుదల చేసింది. (Ice Cream GST rate 2021)
ice cream gst rate: 'ఐస్‌క్రీమ్‌లపై 18% జీఎస్టీ' - ఐస్‌క్రీమ్ జీఎస్టీ
విక్రయ కేంద్రాల్లో అమ్మే ఐస్‌క్రీమ్‌లపై 18 శాతం జీఎస్టీ (Ice Cream GST rate) చెల్లించాల్సి ఉంటుందని కేంద్ర పరోక్ష పన్నులు, సుంకాల బోర్డు తెలిపింది. రెస్టారెంట్లలో కుకింగ్/తయారీ జరుగుతుందని, పార్లర్లలో ఏ దశలోనూ కుకింగ్ జరగదని పేర్కొంది. అందుకే 18 శాతం జీఎస్‌టీ (Ice Cream GST rate in India) విధిస్తామని తెలిపింది.
ఐస్‌క్రీమ్ జీఎస్టీ
ఐస్‌క్రీం పార్లర్లు అలాంటి కేంద్రాల్లో అప్పటికే తయారైన ఐస్‌క్రీమ్‌లను విక్రయిస్తారని, వాటికి రెస్టారెంట్ లక్షణం లేదని తెలిపింది. 'ఐస్‌క్రీమ్ పార్లర్లలో ఏ దశలోనూ ఎలాంటి కుకింగ్ జరగదని, రెస్టారెంట్ సేవల్లో కుకింగ్/తయారీ జరుగుతుంద'ని సీబీఐసీ తెలిపింది. ఐస్‌క్రీమ్‌ను వస్తువుగానే (తయారీ వస్తువు) పరిగణిస్తామని, అది సేవల కిందకు రాదని అందుకే 18 శాతం జీఎస్‌టీ (Ice Cream GST tax rate) విధిస్తామని వివరించింది.