తెలంగాణ

telangana

ETV Bharat / business

రూపాయి చిహ్నానికి 11 ఏళ్లు- ఈ విశేషాలు తెలుసా? - రూపాయి డిజైన్​ రూపొందించింది ఎవరు?

భారతీయ రూపాయి చిహ్నంగా '₹'ను మనం ఇప్పడు వాడుతున్నాం. అంతకుముందు RSగా ఉన్న భారత రూపాయి సింబల్​ను 2010లో అప్పటి ప్రభుత్వం మార్చాలని భావించింది. అందుకు పెద్ద పోటీని నిర్వహించింది. చివరకు ఐఐటీ గువాహటి ప్రొఫెసర్ ఉదయ్​ కుమార్​​ రూపొందించిన డిజైన్​ను ఎంపిక చేసింది. దాన్ని అదే ఏడాది జులై 15 నుంచి అందుబాటులోకి తెచ్చింది.

indian rupee symbol
రూపాయి చిహ్నం

By

Published : Jul 15, 2021, 3:36 PM IST

Updated : Jul 15, 2021, 4:51 PM IST

భారతీయ రూపాయి చిహ్నం-₹ 2010 జులై 15న అందుబాటులోకి వచ్చింది. అయితే.. ఆ సింబల్​ డిజైన్​ కోసం భారత ప్రభుత్వం పెద్ద పోటీనే నిర్వహించింది. భారత సంస్కృతి, సంప్రదాయాలు, మూలాలు ప్రతిబింబించేలా డిజైన్​ రూపొందించాలని ఔత్సాహికుల మెదడుకు పరీక్ష పెట్టింది. ఏకంగా 3 వేలకుపైగా ప్రతిపాదనలు వచ్చాయి. చివరగా ఐఐటీ గువాహటి ప్రొఫెసర్​ ఉదయ కుమార్​ డిజైన్​నే ఎంపిక చేసింది.

భారతీయ రూపాయి లోగో

అయితే ఆ రూపాయి లోగో వెనుక ఎన్నో ఆసక్తికర విశేషాలున్నాయి.

1. ఒకే ఒక్కడు

మొత్తం 3,331 మంది పోటీపడగా.. ఐఐటీ గువాహటి ప్రొఫెసర్​ ఉదయ్​ కుమార్​ ధర్మలింగం పంపిన డిజైన్​నే ఖరారు చేసింది ఆర్థిక మంత్రిత్వ శాఖ.

ఉదయ కుమార్​

2. దేవనగరి నుంచి రోమన్​ వరకు..

భారతీయ కరెన్సీ చిహ్నంలో.. దేవనగరిలో 'ర', రోమన్​ లెటర్​ 'ఆర్'​ ఉంటాయి. దీనిని దృష్టిలో ఉంచుకొని.. వాటిని కలగలిపి కొత్త చిహ్నాన్ని రూపొందించారు ఉదయ్​.

దేవనగరి, రోమన్​ లెటర్స్​ కలగలపి డిజైన్​

3. సమతుల్య ఆర్థిక వ్యవస్థను ప్రతిబింబించేలా..

చట్టం ముందు పౌరులంతా సమానమేనని.. భారత రాజ్యాంగం పేర్కొంది. ఈ సమానత్వం.. మన దేశ కరెన్సీ సింబల్​లోనూ ప్రతిబింబించేలా ఆలోచన చేశారు. చిహ్నంలోని రెండు అడ్డ(సమాంతర) రేఖలు.. సమానత్వాన్ని తెలియపరుస్తాయి. భారత ఆర్థిక వ్యవస్థ.. సమతుల్య ఆర్థిక వ్యవస్థ అనే అర్థం కూడా ఇందులో ఉంది.

4. మిగతా దేశాలకు దీటుగా

భారత్​ అభివృద్ధి చెందుతున్న దేశం నుంచి.. అభివృద్ధి చెందిన దేశంగా మారేందుకు పరుగులు పెడుతోంది. అందుకే చిహ్నాన్ని అభివృద్ది చెందిన ఇతర దేశాల కరెన్సీని పోలేలా సృష్టించారు. అందుకే వాటిలా సింబల్​లో గీతలను తీర్చిదిద్దారు. బ్రిటన్​ పౌండ్​, యూఎస్​ డాలర్​, యూరప్-యూరో, జపాన్​-యెన్​, థాయ్​లాండ్​-బాట్​ ఇలా ఏది చూసినా అందులోనూ ఇలాంటి లైన్లే కనిపిస్తాయి.

అభివృద్ధి చెందిన దేశాల కరెన్సీ

5. ష్రియో రేఖ..

హిందీ.. దేవనగరి లిపి నుంచే ఉద్భవించిన విషయం తెలిసిందే. ఇందులో ష్రియో రేఖకు గురించి చెప్పుకోవాలి. హిందీ లిపిలో ప్రతి పదానికీ పైన ఒక లైన్​ ఉంటుంది. దానినే ష్రియో రేఖ అంటారు. అందుకే రూపీ సింబల్​కూ పైన అడ్డగీత ఉంటుంది.

6. త్రివర్ణ పతాకాన్ని పోలేలా..

భారత పతాకంలో మూడు రంగులుంటాయి. ఇవి బలం, శాంతి, వృద్ధి, సౌభాగ్యాలకు సూచిక. అందుకే త్రివర్ణ పతాకం విశిష్టత.. భారత కరెన్సీ చిహ్నంలోనూ కనిపించేలా రెండు అడ్డగీతల(కాషాయం, ఆకుపచ్చ) మధ్య తెలుపు వర్ణం ఉంటుంది.

7. సులభంగా ఉండేలా..

భారతీయ రూపాయి సింబల్​ డిజైన్​ చాలా సింపుల్​గా ఉంటుంది. ఏ డిజైనర్లతోనైనా దీనిని డిజైన్​ చేయించడం చాలా సులువు.

ఇదీ చూడండి:ఈ కరెన్సీలకే అత్యధిక విలువ..!

ఇదీ చూడండి:బంగారం ధర ఎప్పుడు తగ్గుతుంది?

Last Updated : Jul 15, 2021, 4:51 PM IST

ABOUT THE AUTHOR

...view details