తెలంగాణ

telangana

ETV Bharat / business

ఆగస్టులో 13.08 లక్షల ఉద్యోగాలు..జులై కంటే తక్కువే - ఎంప్లాయీస్​ ప్రావిడెండ్​ ఫండ్ ఆర్గనైజేషన్

ఆగస్టులో కొత్తగా 13.08 లక్షల ఉద్యోగాల సృష్టించినట్లు ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్​ఐసీ) పేరోల్​ డేటా ఆధారంగా ఎన్​ఎస్​ఓ వెల్లడించింది. జులైతో పోల్చితే దాదాపు 1.5లక్షల ఉద్యోగాలు తగ్గినట్లు గణాంకాలు స్పష్టం చేశాయి.

ఆగస్టులో 13.08 లక్షల ఉద్యోగాల సృష్టి!

By

Published : Oct 26, 2019, 6:46 AM IST

Updated : Oct 26, 2019, 11:34 AM IST

ఆగస్టులో దేశవ్యాప్తంగా 13.08 లక్షల ఉద్యోగాలు సృష్టించినట్లు ఎంప్లాయిస్​ స్టేట్ ఇన్సూరెన్స్​ కార్పొరేషన్​ (ఈఎస్​ఐసీ) పేరోల్​ డేటా చెబుతోంది. జులైలో 14.49 లక్షల ఉద్యోగాల సృష్టి జరిగింది. దీనితో పోల్చుకుంటే ఆగస్టులో ఉద్యోగాల సృష్టి తగ్గిందని డేటా స్పష్టం చేస్తోంది.

2018-19లో ఈఎస్​ఐసీలో 1.49 కోట్ల కొత్త చందాదారులు నమోదైనట్లు, జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్​ఎస్​ఓ) నివేదిక తెలిపింది. 2017 సెప్టెంబర్​ నుంచి 2019 ఆగస్టు వరకు సుమారు 2.97 కోట్ల మంది చందాదారులు ఈఎస్​ఐసీ పథకంలో చేరినట్లు పేర్కొంది.

రిటైర్మెంట్​ ఫండ్​ బాడీ (ఈపీఎఫ్​ఓ), పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్​మెంట్​ అథారిటీ (పీఎఫ్​ఆర్​డీఏ)లను ఈఎస్​ఐసీ నిర్వహిస్తోంది. ఈ సంస్థల వివిధ సామాజిక భద్రతా పథకాల చందాదారుల పేరోల్ డేటా ఆధారంగా ఎన్​ఎస్​ఓ తాజా నివేదిక రూపొందించింది.

ఈ మూడు సంస్థల పెరోల్ డేటా లేదా చందాదారుల సమాచారాన్ని 2018 ఏప్రిల్​ నుంచి విడుదల చేస్తోంది. 2017 సెప్టెంబర్​ నుంచి ఉన్న డేటాను ఈ నివేదికల్లో పొందుపరుస్తోంది.

2017 సెప్టెంబర్ నుంచి మార్చి 2018 వరకు ఈఎస్​ఐసీలో స్థూలంగా 83.35 లక్షల కొత్త చందాదారులు నమోదయ్యారని నివేదిక స్పష్టం చేసింది.​

ఈపీఎఫ్​ఓ

ఈ ఏడాది ఆగస్టులో ఎంప్లాయిస్​ ప్రావిడెండ్​ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్​ఓ)లో 10.86 లక్షల చందాదారులు చేరారు. జులైలో 11.71 లక్షల మంది నమోదయ్యారు.

2018-19లో నికర ప్రాతిపదికన 61.12 లక్షల మంది కొత్త చందాదారులు ఈపీఎఫ్​ఓ నిర్వహిస్తున్న సామాజిక భద్రత పథకాల్లో చేరారు. 2017 సెప్టెంబర్​ నుంచి 2018 మార్చి మధ్యలో 15.52 లక్షల మంది కొత్తగా చేరారని ఎన్​ఎస్​ఓ నివేదిక స్పష్టం చేసింది.

2017 సెప్టెంబర్​ నుంచి 2019 ఆగస్టు మధ్య ఈపీఎఫ్​ఓ పథకంలో సుమారు 2.75 కోట్ల మంది కొత్త చందాదారులు చేరినట్లు నివేదిక తెలిపింది.

తేడాలు ఉండొచ్చు..

చందాదారుల సంఖ్య వివిధ వనరుల నుంచి సేకరించామని, అందువల్ల డేటాలో అతివ్యాప్తి అంశాలు ఉన్నాయని ఎన్​ఎస్​ఓ నివేదిక స్పష్టం చేసింది. అంచనాలు సంకలితం మాత్రం కాదని పేర్కొంది.

ఇదీ చూడండి:కశ్మీర్, లద్దాఖ్​ల​కు లెఫ్టినెంట్​ గవర్నర్ల నియామకం


Last Updated : Oct 26, 2019, 11:34 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details