శీతాకాలం వచ్చేసింది. శరీరాన్ని వెచ్చగా ఉంచేందుకు బ్లాంకెట్లు, స్వెటర్లు సిద్ధం చేసుకునే సమయం ఆసన్నమైంది. అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్‌లో కూడా చలికాలాన్ని దృష్టిలో ఉంచుకుని వింటర్ గ్యాడ్జెట్స్‌పై భారీ డిస్కౌంట్లు ఇస్తున్నాయి ప్రముఖ కంపెనీలు. ఈ ఆఫర్లో అందుబాటులో ఉన్న టాప్-12 వింటర్ గ్యాడ్జెట్స్‌పై ఓ లుక్కేయండి.
1. హీటింగ్ ఎలక్ట్రిక్ బ్లాంకెట్
శరీరాన్ని వెచ్చగా ఉంచే డబుల్ బెడ్ హీటింగ్ బ్లాంకెట్ ధర అమెజాన్ సేల్ ఆఫర్లో 58శాతం డిస్కౌంట్‌తో రూ.1,699గా ఉంది. ఈ ఫైర్ రెసిస్టాంట్ బ్లాంకెట్ టెంపరేచర్‌ను కంట్రోల్ చేసెందుకు రిమోట్ కూడా వస్తుంది.
2. యూఎస్బీ హీటెడ్ శాలువా
హోన్లైఫ్ హీటెడ్ శాలువా ధర 68 శాతం డిస్కౌంట్‌తో రూ.3,693 ఉంది. ఈ శాలువాకు నాణ్యమైన కార్బన్ ఫైబర్‌తో తయారు చేసిన హీటింగ్ ప్యాడ్ ఉంటుంది. ఇది శరీరాన్ని వెచ్చగా ఉంచడమే గాక.. నొప్పుల నుంచి కూడా ఉపశమనం కల్పిస్తుంది.
3. వాటర్‌ప్రూఫ్ గ్లవ్స్
హైవర్ వాటరప్రూఫ్ గ్లవ్స్ విత్ టచ్‌స్క్రీన్ ధర 53శాతం డిస్కౌంట్‌తో రూ.899గా ఉంది. హీట్లాక్ ఫీచర్‌తో వచ్చే ఈ గ్లవ్స్ చేతులను వెచ్చగా ఉంచుతాయి.
4. బ్లూటూత్ హెడ్‌ఫోన్స్ హ్యాట్
బీనీ బ్లూటూత్ హెడ్‌ఫోన్స్ ధర 43శాతం డిస్కౌంట్‌తో రూ.4,036గా ఉంది. ఇందులోని బిల్ట్ ఇన్ రీఛార్జిబుల్ బ్యాటరీని రెండు గంటలు ఛార్జ్ చేస్తే 10 గంటలు వరకు పని చేస్తుంది. డిటాచిబుల్ కంట్రోల్ బోర్డ్, మైక్రోఫోన్, స్పీకర్లు కూడా ఉంటాయి. ఈ బ్లూటూత్ బీనీ హ్యాట్ రేంజ్ 45 అడుగులు.
5. ఎలక్ట్రిక్ మసాజర్
శీతాకాలంలో కాళ్లను వెచ్చగా ఉంచే జెనీ ఎలక్ట్రిక్ మసాంజర్ ధర 54 శాతం డిస్కౌంట్‌తో రూ.2,789గా ఉంది. టెంపరేచర్ కంట్రోల్ చేసేందుకు ఈ వాషబుల్ మసాజర్‌తో పాటు రిమోట్ కూడా వస్తుంది.
6. కాఫీ మగ్ విత్ హాట్ ప్లేట్
హాట్ప్లేట్ ద్వారా టీ, కాఫీని వేడిగా ఉంచే టొర్మెటీ సిరామిక్ కాఫీ మగ్ ధర 58శాతం డిస్కౌంట్‌తో రూ.1,099గా ఉంది. ఇందులోని హీటర్లు తక్కువ కరెంటును ఉపయోగిస్తాయి. గ్లాస్ కప్పులను కూడా దీనిపై ఉపయోగించవచ్చు.