తెలంగాణ

telangana

ETV Bharat / business

ఆందోళనకు సిద్ధమైన జెట్​ ఉద్యోగులు!

వేతన బకాయిలకు నిరసనగా విధులను బహిష్కరించాలని జెట్​ ఎయిర్​వేస్ పైలట్లు యోచిస్తున్నారు. అయితే ఇంతవరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని పైలట్ల సంఘం ఎన్​ఏజీ​ ప్రకటించింది.

ఆందోళనకు సిద్ధమైన జెట్​ ఉద్యోగులు!

By

Published : Apr 14, 2019, 8:26 PM IST

తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న జెట్​ ఎయిర్​వేస్​కు మరో దెబ్బతగిలే అవకాశం ఉంది. వేతనాలు చెల్లించనందుకు నిరసనగా విధులను బహిష్కరించాలని 'నేషనల్​ ఏవియేటర్స్​ గిల్డ్(ఎన్​ఏజీ​)​' సంఘానికి చెందిన 1100 మంది జెట్​ ఎయిర్​వేస్​ పైలట్లు యోచిస్తున్నారు. మార్చి నెల జీతాలను సంస్థ ఇప్పటి వరకు వారికి చెల్లించలేదు.

ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు

విధుల బహిష్కరణపై ఇంతవరకు తుది నిర్ణయం తీసుకోలేదని ఎన్​ఏజీ​ తెలిపింది. రేపు ఉదయం భేటీ అయి కార్యాచరణపై సమాలోచన చేస్తామని​ ప్రకటించింది.

ఆందోళనల వాయిదా పర్వం

జెట్​ ఎయిర్​వేస్​లో మొత్తం 16వందల మంది పైలట్లు ఉన్నారు. ఇందులో 1100 మంది ఎన్​ఏజీలో సభ్యులని ఆ సంఘం చెబుతోంది.

మొదట ఏప్రిల్​ 1 నుంచి నిరసన చేపట్టాలని అనుకున్నారు పైలట్లు. కొత్త యాజమాన్యానికి సమయం ఇవ్వాలన్న ఉద్దేశంతో దీనిని ఏప్రిల్​ 15కు వాయిదా వేసుకున్నారు. గత నెల నుంచి ఎస్​బీఐ నేతృత్వంలోని కొత్త కన్సార్టియమ్​ జెట్​ యాజమాన్య బాధ్యతలను నిర్వహిస్తోంది.

కొనసాగుతున్న విమానాల రద్దు

పశ్చిమ దేశాలకు వెళ్లే విమానాల రద్దును ఈ నెల 16వ తేదీ వరకు పొడిగించినట్లు జెట్​ ఎయిర్​వేస్ ప్రకటించింది. ఆసియాన్, సార్క్​ దేశాల్లో సేవలను నిరవధికంగా రద్దు చేసింది. చెన్నై నుంచి పారిస్​, అమెరికాలోని టొరంటో సర్వీసుల రద్దును కూడా పొడిగించింది.

ABOUT THE AUTHOR

...view details