తెలంగాణ

telangana

ETV Bharat / business

2026 కల్లా భారత్​లో 100 కోట్ల 'స్మార్ట్‌ ఫోన్‌' యూజర్లు - స్మార్ట్‌ ఫోన్‌ యూజర్లు భారత్​లో

100 Crore Smart Phone users: 2026 కల్లా భారత్‌లో స్మార్ట్‌ఫోన్‌ వినియోగదారుల సంఖ్య 100 కోట్లు దాటనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు డెలాయిట్‌ అనే సంస్థ అంచనా వేసింది.

by 2026 india reaches 100 crore mobile phone users
2026 కల్లా వంద కోట్ల 'స్మార్ట్‌ ఫోన్‌' భారతం

By

Published : Feb 23, 2022, 5:58 AM IST

100 Crore Smart Phone users: 2026 కల్లా భారత్‌లో 100 కోట్ల మంది స్మార్ట్‌ఫోన్‌ వినియోగదార్లు ఉంటారని డెలాయిట్‌ అంచనా వేస్తోంది. ఇంటర్నెట్‌ ఆధారిత ఫోన్ల విషయంలో గ్రామీణ ప్రాంతాలు కీలక భూమిక పోషిస్తాయని మంగళవారం విడుదల చేసిన 'డెలాయిట్‌ 2022 గ్లోబల్‌ టీఎమ్‌టీ(టెక్నాలజీ, మీడియా-వినోదం, టెలికాం) అంచనాల్లో తెలిపింది.

అందులోని ముఖ్యాంశాలు..

  • 2021లో భారత్‌లో 120 కోట్ల మంది మొబైల్‌ వినియోగదార్లుండగా.. అందులో 75 కోట్ల మంది స్మార్ట్‌ఫోన్‌ వినియోగిస్తున్నారు.
  • 2026 కల్లా స్మార్ట్‌ఫోన్‌ వినియోగదార్ల సంఖ్య 100 కోట్లకు చేరడానికి గ్రామీణ ప్రాంతాల్లో నమోదయ్యే 6 శాతం సమ్మిళిత వృద్ధి రేటు(సీఏజీఆర్‌) సహకరించనుంది. పట్టణాల్లో ఈ వృద్ధి 2.5 శాతంగా ఉండొచ్చు. 2025 కల్లా అన్ని గ్రామాల్లో ఫైబర్‌ నెట్‌ను తీసుకువచ్చే లక్ష్యంతో పనిచేస్తున్న 'భారత్‌నెట్‌ప్రోగామ్‌' కూడా మద్దతు ఇవ్వవచ్చు.
  • ఫిన్‌టెక్‌, ఇ-ఆరోగ్యం, ఇ-లెర్నింగ్‌ కారణాలతో ఇంటర్నెట్‌ అవసరాలు పెరగడంతో స్మార్ట్‌ఫోన్‌ వినియోగం పెరుగుతోంది.
  • 2021లో పట్టణాల్లో స్మార్ట్‌ఫోన్‌లకు మారిన వారు 75 శాతంగా ఉండగా.. 2026 కల్లా ఇది 95 శాతానికి చేరొచ్చు. గ్రామాల్లోనూ 80 శాతం మంది వీటివైపు మొగ్గుచూపవచ్చు. ఎందుకంటే సగటున ఒక ఫోన్‌ జీవితకాలం నాలుగేళ్లనుకుంటే.. వచ్చే అయిదేళ్లలో కొత్త కొనుగోళ్లన్నీ స్మార్ట్‌ఫోనే కావచ్చు.
  • పట్టణాల్లో 2021లో ఫీచర్‌ ఫోన్ల మార్పిడి 7.2 కోట్లుగా ఉండగా.. 2026కు ఇది 6 కోట్లకు పరిమితం కావొచ్చు. గ్రామీణ ప్రాంతంలో 2021లో 7.1 కోట్లుగా ఉన్న రీప్లేస్‌మెంట్‌ 6 కోట్లకు తగ్గొచ్చు.
  • 5జీ వచ్చాక.. 2026 కల్లా దేశంలోకి అదనంగా 13.5 కోట్ల స్మార్ట్‌ఫోన్ల వరకు రావొచ్చు. 2022-26 మధ్య మొత్తం దేశంలోకి 170 కోట్ల స్మార్ట్‌ఫోన్లు రావొచ్చు. దీని వల్ల ఈ మార్కెట్‌ 25000 కోట్ల డాలర్ల (సుమారు రూ.18.75 లక్షల కోట్ల)కు చేరుతుంది. ఇందులో 84 కోట్ల మేర 5జీ ఫోన్లు ఉండొచ్చు.
  • ఇటీవలి సెమీకండక్టర్‌ తయారీకి ప్రకటించిన 10 బి. డాలర్ల ప్యాకేజీ వల్ల హ్యాండ్‌సెట్‌ తయారీకి ఊతం లభిస్తుంది. వచ్చే అయిదేళ్లలో ప్రపంచంలోనే రెండో అతిపెద్ద స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌గా అవతరించొచ్చు. అంతర్జాతీయ చిప్‌ కొరత ప్రపంచవ్యాప్త తయారీ పరిశ్రమలపై ప్రభావం చూపింది. 2023 కల్లా చిప్‌ల లభ్యత సాధారణ స్థాయికి చేరొచ్చు. భారత్‌ సైతం బలమైన ప్రాంతీయ హబ్‌గా మారొచ్చు.

స్ట్రీమింగ్‌ రంగంలో భారీ మార్పులు

అంతర్జాతీయ కంటెంట్‌(కొరియన్‌, ఇజ్రాయిలీ, స్పానిష్‌)కు భారత్‌లో ఎక్కువ మంది ఆకర్షితులవుతుండడంతో సబ్‌టైటిల్స్‌ ఉన్న, డబ్బింగ్‌ కంటెంట్‌కు గిరాకీ పెరుగుతోంది. ఇవన్నీ స్ట్రీమింగ్‌ కంపెనీలు తమ వ్యూహాలను సవరించేలా చేస్తున్నాయి.

తమ వినియోగదార్ల సంఖ్యను స్థిరీకరించుకోవడం కోసం సర్వీసు ప్రొవైడర్లు పోటీ ధరల్లోనే కొనసాగొచ్చు. వేగంగా మారుతున్న ఈ మార్కెట్‌లో ఏమైనా జరగొచ్చు.

ఇదీ చూడండి:Local circles survey: మన సమాచారం ఎవరికో చేరుతోంది..

ABOUT THE AUTHOR

...view details