తెలంగాణ

telangana

ETV Bharat / business

కరోనాతో కదిలిన కుబేర స్థానం- 18.8 బిలియన్​ డాలర్లు ఉఫ్ - వ్యాపార వార్తలు

కరోనా వైరస్​.. ఇప్పుడు ప్రపంచదేశాలను గడగడలాడిస్తోన్న మహమ్మారి. ఈ వైరస్​ కారణంగా ప్రపంచవ్యాప్తంగా వ్యాపార, వాణిజ్యానికి తీవ్ర ఆంతరాయం ఏర్పడింది. ఈ కారణంగా పది మంది ప్రపంచ కుబేరులు 18.8 బిలియన్ డాలర్లు కోల్పోయారు. వారి వివరాలు ఇలా ఉన్నాయి.

corona impact on Billionaires
కరోనాతో ధనవంతుల సంపద ఆవిరి

By

Published : Mar 13, 2020, 6:11 AM IST

Updated : Mar 13, 2020, 8:24 PM IST

ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తోంది. 100కు పైగా దేశాలకు విస్తరించిన ఈ మహమ్మారి ఇప్పటివరకు వేలాది మందిని పొట్టనబెట్టుకుంది. కరోనా వైరస్​ విస్తరణ ప్రారంభమైనప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. ఈ కారణంగా ప్రపంచ కుబేరుల్లో కేవలం 10 మంది 18.8 బిలియన్ డాలర్ల సంపదను కోల్పోయారు.

కరోనాతో ఎక్కువగా నష్టపోయిన కుబేరులు వీరే..

పేరు నష్టం (బిలియన్ డాలర్లలో)
1.మార్క్ జుకర్​బర్గ్​ (ఫేస్​బుక్ వ్యవస్థాపకుడు) 4.1
2.ముకేశ్ అంబానీ(రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత) 3.2
3.లారీ ఎలిసన్​ (ఒరాకిల్ సహవ్యవస్థాపకుడి) 2.2
4.లారీ పేజ్​ (గూగుల్ సహవ్యవస్థాపకుడు) 1.7
5.సెర్గి బ్రిన్​​ (గూగుల్ సహవ్యవస్థాపకుడు) 1.6
6.షెల్డన్​ అడిల్సన్​(లాస్​వేగాస్​ సాండ్స్​ సీఈఓ) 1.5
7.జార్జ్​ స్కఫ్లర్​ (స్కఫ్లర్ గ్రూప్ ఛైర్మన్) జర్మనీ 1.3
8. హరోల్డ్​ హమ్మ్ &ఫ్యామిలీ (అమెరికా పారిశ్రామికవేత్త) 1.2
9.ఎర్నీ గరికా II (అమెరికా పారిశ్రామికవేత్త) 1
10.థామస్ పెటార్ఫీ (అమెరికా పారిశ్రామికవేత్త) 1

ఇదీ చూడండి:'ఆ ఉద్యోగులకు 2 వారాలు పెయిడ్​ లీవ్స్​'

Last Updated : Mar 13, 2020, 8:24 PM IST

ABOUT THE AUTHOR

...view details