దేశ అభివృద్ధిలో మహిళలకు భాగస్వామ్యం కల్పించడానికి, వారికి సౌకర్యాలు కల్పించి, ప్రోత్సహించడానికి ఓ కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.
మోదీ 2.0 ప్రభుత్వంలో మొదటిసారి బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్ మహిళలకు వరాలు ప్రకటించారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో మహిళలది ప్రత్యేక పాత్ర అని కొనియాడారు.
"మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడానికి ఈ ప్రభుత్వం కృషి చేస్తోంది. ముద్ర, స్టాండప్ ఇండియా ద్వారా, స్వయం సహాయక సంఘాల ద్వారా మహిళలకు సహకారం అందిస్తోంది. మహిళా పారిశ్రామిక వేత్తలను మరింతగా ప్రోత్సహించడానికి... మహిళా స్వయం సహాయక సంఘాలకు వడ్డీ రాయితీ పథకాన్ని... దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ అమలు చేయాలని నేను ప్రతిపాదిస్తున్నాను. అలాగే జన్‌ధన్ ఖాతా ఉన్న ప్రతి మహిళలకు రూ.5 వేలు ఓవర్‌డ్రాఫ్ట్ సౌకర్యం కల్పిస్తాం. అంతే కాకుండా ముద్ర యోజన ద్వారా సంఘంలోని ఒక మహిళకు లక్ష రూపాయల వరకు రుణసౌకర్యం కల్పిస్తాం."
-నిర్మలా సీతారామన్, ఆర్థికమంత్రి