సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ దంపతులు తిరుమల శ్రీవారి సేవలో పాల్గొన్నారు. తిరుమల పద్మావతి అతిథిగృహం నుంచి ఆలయ వాహన మండపానికి చేరుకున్న జస్టిస్ దంపతులకు.. తితిదే అదనపు ఈవో ధర్మారెడ్డి, సీవీఎస్వో గోపీనాథ్ రెడ్డి.. సాదర స్వాగతం పలికారు. అక్కడి నుంచి తిరుమల శ్రీవారి ఆలయ మహాద్వారం వద్దకు చేరుకున్న జస్టిస్ ఎన్వీ రమణ దంపతులను తితిదే చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో కేఎస్ జవహర్ రెడ్డి ఆహ్వానించారు.
శ్రీవారి సేవలో సీజేఐ జస్టిస్ ఎన్.వి.రమణ దంపతులు - తిరుమల శ్రీవారి సేవలో సీజేఐ జస్టిస్
తిరుమల శ్రీవారిని సీజేఐ జస్టిస్ ఎన్.వి.రమణ దంపతులు దర్శించుకున్నారు. తితిదే ఛైర్మన్, ఈవో, ఆలయ అర్చకులు.. వారికి ఘన స్వాగతం పలికారు.
శ్రీవారి సేవలో సీజేఐ జస్టిస్ ఎన్.వి.రమణ దంపతులు
తిరుమల శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు.. ఆలయ పెద్ద మర్యాద అయిన ఇస్తికఫాల్ విధానంలో స్వాగతం పలికి... సంప్రదాయబద్ధంగా వేదమంత్రోచ్ఛరణల మధ్య ఆలయంలోకి తీసుకువెళ్లారు. శ్రీవారి దర్శనం చేయించి.. స్వామివారి ఆశీర్వచనాన్ని అందించారు. అనంతరం... తిరుచానూరు వెళ్లి పద్మావతి అమ్మవారిని దర్శించుకోనున్నారు.
ఇదీ చదవండి:కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఛైర్మన్‌గా ఎం.పి.సింగ్ ..!
Last Updated : Jun 11, 2021, 9:18 AM IST