లోక్సభలో ఈ రోజు ప్రవేశపెట్టిన బడ్జెట్ లక్ష్యాలను చేరుకోవడానికి ప్రభుత్వం అనేక సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుందని ప్రముఖ రేటింగ్స్ సంస్థ మూడీస్ విశ్లేషించింది. వృద్ధి రేటు మందగించిన సమయంలో ఆర్థిక లోటు తగ్గింపు, అధిక వృద్ధి రేటు సాధన, రైతులు, నిమ్న వర్గాలకు ఆర్థిక తోడ్పాటు వంటి అంశాలు ప్రభుత్వానికి సవాలుగా మారనున్నాయని తెలిపింది.
ఆదాయ సహకారం అందించేందుకు బడ్జెట్లో ప్రకటించిన పథకాల వల్ల ఆర్థిక వ్యవస్థ మరింత నెమ్మదిస్తుందని హెచ్చరించింది మూడీస్. పన్ను వసూలు తగ్గిపోతే ద్రవ్యలోటు నిర్దేశిత లక్ష్యానికి చేరుకోవటం అసాధ్యమని పేర్కొంది.
"దీన్ని సాధించాలంటే ప్రభుత్వం పెట్టుబడుల ఉపసంహరణ, కేంద్ర బ్యాంకుపై ఆధారపడాల్సి వస్తుంది. ధనికులపై అదనపు పన్ను భారాన్ని మోపాల్సి ఉంటుంది. ఇప్పటికే పెట్రోల్, డీజిల్, విలువైన లోహాలు, పొగాకు ఉత్పత్తులపై సుంకాలను పెంచింది."
-మూడీస్
రుణ భారం