తెలంగాణ

telangana

ETV Bharat / briefs

యువతను ఆకట్టుకుంటున్న "గ్లాస్​మేట్స్" లిరికల్ - సునీల్

'చిత్రలహరి' సినిమాలో సాయిధరమ్ తేజ్, సునీల్ నటించిన 'గ్లాస్​మేట్స్' లిరికల్ పాట.. యువతను ఆకట్టుకుంటోంది.

యువతను ఆకట్టుకుంటున్న "గ్లాస్​మేట్స్" లిరికల్

By

Published : Mar 25, 2019, 6:05 PM IST

సాయిధరమ్ తేజ్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా "చిత్రలహరి". అందులోని 'గ్లాస్​మేట్స్' లిరికల్ పాట యువతను ఆకట్టుకుంటోంది. కమాన్ బాయ్స్ అంటూ మొదలయ్యే ఈ గీతాన్ని ఫన్నీ పదాలతో రూపొందించారు. రాహుల్ సిప్లి గంజ్, పెంచల్ దాస్ తమ గాత్రంతో అలరించారు.

కల్యాణి ప్రియదర్శన్, నివేదా పేతురాజ్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకి కిశోర్ తిరుమల దర్శకత్వం వహించారు. సునీల్, వెన్నెల కిశోర్ ప్రత్యేక పాత్రల్లో కనిపించనున్నారు. మైత్రీ మూవీస్ నిర్మించిన ఈ చిత్రానికి దేవీశ్రీ ప్రసాద్ సంగీతమందించాడు. ఏప్రిల్ 12న థియేటర్లలోకి రానుందీ సినిమా.


ABOUT THE AUTHOR

...view details