నాగచైతన్య.. సమంత జంటగా నటిస్తోన్న సినిమా మజిలీ. ఈ చిత్రంలోని మరో లిరికల్ వీడియో ఈ రోజు విడుదలైంది.. 'ఏడెత్తు మల్లెలే' అనే పల్లవితో సాగే ఈ పాట అభిమానులను ఆకట్టుకుంటుంది. గోపి సుందర్ సంగీతమందించారు. కాలభైరవ ఆలపించారు. ఈ పాట రాసింది దర్శకుడు శివ నిర్వాణే కావడం విశేషం.
'మజిలీ'లో మరో పాట విడుదల - shiva nirvana
అక్కినేని నాగచైతన్య, సమంత జంటగా నటించిన సినిమా 'మజిలీ'. ఇందులోని ఏడెత్తు మల్లెలే అంటూ సాగే ఓ లిరికల్ పాటను ఈ రోజు విడుదల చేశారు.
విడుదలైన ఏడెత్తు మల్లెలే అంటూ సాగే లిరికల్ పాట
ఇప్పటికే వచ్చిన పాటలు నెట్టింట్లో సందడి చేస్తున్నాయి. వైజాగ్ నేపథ్యంలో సాగే ప్రేమకథగా ఈ సినిమా తెరకెక్కుతోంది. నిజజీవితంలో భార్యాభర్తలైన చైతు-సామ్...ఇందులోనూ అదే పాత్రల్లో కనిపించనున్నారు. వేసవి కానుకగా ఏప్రిల్ 5న థియేటర్లలోకి రానుందీ చిత్రం.
Last Updated : Mar 19, 2019, 8:16 PM IST