తెలంగాణ

telangana

ETV Bharat / briefs

'సంక్షేమ పథకాలతో పేదలకు అండగా తెరాస ప్రభుత్వం' - వైరాలో చెక్కుల పంపిణీ

ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలో ఎమ్మెల్యే రాములు నాయక్ సుడిగాలి పర్యటన చేశారు. కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు.

లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే రాములు నాయక్
లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే రాములు నాయక్

By

Published : Sep 12, 2020, 10:18 PM IST

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలతో అన్ని వర్గాలకు అండగా నిలుస్తోందని వైరా ఎమ్మెల్యే లావుడియా రాములు నాయక్ అన్నారు. ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలో కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు.

నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేసిన ఎమ్మెల్యే… నాలుగు మండలాల్లో రూ. 2 కోట్ల 55 లక్షల విలువైన 314 మంది లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఆరోగ్యశ్రీతోపాటు ముఖ్యమంత్రి సహాయ నిధితో పేదలకు ప్రభుత్వ వైద్య సహాయం అందిస్తుందన్నారు. కల్యణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు పేద కుటుంబాలకు భరోసాగా నిలుస్తుందన్నారు.

రైతు బంధుతో పాటు పలు సంక్షేమ పథకాలతో వ్యవసాయ రంగానికి ముఖ్యమంత్రి కేసీఆర్… ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్ రాజశేఖర్, మున్సిపల్ ఛైర్మన్ జైపాల్, నాయకులు వెంకటరెడ్డి, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details