తెలంగాణ

telangana

By

Published : Jun 16, 2019, 9:49 AM IST

ETV Bharat / briefs

2023లో తెలంగాణలో వచ్చేది భాజపా ప్రభుత్వం: మురళీధర్ రావు

తెలంగాణలో రానున్న కాలంలో భాజపా సొంతంగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆ పార్టీ నాయకులు ధీమా వ్యక్తం చేశారు.  భవిష్యత్​లో అన్ని వర్గాల ప్రజలు కమలం వైపే మొగ్గు చూపుతారని విశ్వసించారు.

భవిష్యత్​లో అన్ని వర్గాల ప్రజలు కమలం వైపే మొగ్గు చూపుతారు : మురళీధర్ రావు

భాజపాలో చేరిన పలువురు నేతలు

రానున్న రోజుల్లో రాష్ట్రంలో భాజపా సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు అన్నారు. తాము కూడా దేశం కోసం అంటూ భాజపాలో చేరుతున్న కూకట్​పల్లి​ బాలాజీనగర్ కార్పొరేటర్ కావ్య హరీశ్​ రెడ్డి దంపతులకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వివిధ పార్టీలకు చెందిన నాయకులు కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. తెరాస ప్రభుత్వం హైదరాబాద్​ను సింగపూర్ చేస్తామని, ప్రధాన ప్రాంతాలను శాటిలైట్ నగరాలుగా తీర్చిదిద్దుతామని చెప్పి విస్మరించారన్నారు.

తెరాస ప్రభుత్వంతో ప్రజలు విసిగిపోయారని, తెలంగాణ ప్రజల క్షేమాన్ని కోరే ఏకైక పార్టీ భాజాపా అని రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మన్ తెలిపారు. 2023 ఎన్నికల్లో గోల్కొండ ఖిల్లాపై కాషాయ జెండా ఎగరనుందని ధీమా వ్యక్తం చేశారు. కుటుంబ పాలనకు స్వస్తి చెప్పాలంటే అది తమతోనే సాధ్యమన్నారు. ప్రజలు నమ్మకంతో కాంగ్రెస్ నాయకులను గెలిపిస్తే తెరాసకు అమ్ముడు పోతున్నారని ఆరోపించారు.

మోదీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు తెలంగాణకు రాకుండా కేసీఆర్ అడ్డుపడుతున్నారని.. నిజామాబాద్ ఎంపీ అరవింద్ తెలిపారు. ప్రజలు తెరాస మాటలు నమ్మే రోజులు పోయాయని.. రానున్న కాలంలో భారతీయ జనతా పార్టీకి పట్టం కడతారని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇవీ చూడండి : 'హైదరాబాద్ పర్యాటక​ మణిహారంగా దుర్గంచెరువు'

ABOUT THE AUTHOR

...view details