తెలంగాణ

telangana

ETV Bharat / briefs

2023లో తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేసి తీరుతాం! - kcr

వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో భాజపా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు ఆ పార్టీ నేత, మధ్యప్రదేశ్​ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్.

తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేసి తీరుతాం!

By

Published : Jun 26, 2019, 7:18 PM IST

తెలంగాణ, ఒడిశా, తమిళనాడు, కశ్మీర్, పశ్చిమ బంగాలో అధికారంలోకి రావడమే తమ లక్ష్యమని భాజపా నేత, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ అన్నారు. హైదరాబాద్​లో పార్టీ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌తో కలిసి ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. కొత్త ప్రాంతాలకు కమలం పార్టీని విస్తరించడానికి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు శివరాజ్​సింగ్ పేర్కొన్నారు. భాజపా జాతీయ నేతలందరూ తెలంగాణ, పశ్చిమ బంగాపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు స్పష్టం చేశారు. ఆ రెండు రాష్ట్రాల్లో భాజపా సీట్లు సాధించడం ఆనందకరమైన విషయమన్నారు.

శ్యాంప్రసాద్ ముఖర్జీ జయంతి రోజైన.. జూలై 6న సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రధాని మోదీ ప్రారంభిస్తారని తెలిపారు. జూలై 7 నుంచి 11 వరకు సభ్యత్వ నమోదు క్యాంపెనింగ్ నిర్వహించనున్నట్లు శివరాజ్ సింగ్ చౌహన్ వివరించారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో భాజపా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి నీతి ఆయోగ్‌ కార్యక్రమాలకు, సెక్రటేరియట్‌కు రారని ఎద్దేవా చేశారు.

తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేసి తీరుతాం!

ఇవీ చూడండి: రక్షణ లేని ట్రాన్స్​ఫార్మర్.. బాలుడికి కరెంట్​ షాక్!

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details