విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటే సీఎం కేసీఆర్ మాత్రం విహార యాత్రలు చేస్తున్నారని సీపీఐ నేత చాడ వెంకట్రెడ్డి మండిపడ్డారు. సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో ఇంటర్ ఫలితాల గందరగోళంపై జరిగిన అఖిల పక్ష నేతల సమావేశంలో ఆయన ఘాటుగా స్పందించారు. ఇంటర్ బోర్డు ఫలితాల అవకతవకలపై విద్యార్థి సంఘాలతో ఏర్పాటు చేసిన సమావేశంలో భవిష్యత్ కార్యచరణ రూపొందిస్తామని తెలిపారు.
ఈ పరిణామాలపై రాష్ట్రపతిని కలిసి ప్రభుత్వ తీరుపై లేఖ అందిస్తామని తెజస అధ్యక్షుడు కోదండరాం అన్నారు. ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్థుల పదో తరగతి మెమోలు జతచేసి... జాతీయ మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు చేస్తామని స్పష్టం చేశారు. సమావేశంలో ప్రొ.కోదండరాం, కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు జెట్టి కుసుమకుమార్, ప్రొ.పీఎల్ విశ్వేశ్వరయ్య తదితరులు పాల్గొన్నారు.
'ప్రభుత్వ తీరుపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తాం'
ఓ పక్క ఇంటర్ ఫలితాల తారుమారుతో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే మరో పక్క సీఎం కేసీఆర్ విహార యాత్రలు చేస్తున్నారని అఖిలపక్ష నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రభుత్వంపై జాతీయ మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు చేస్తాం : కోదండరాం
ఇవీ చూడండి : ఉగ్రరూపంలో భానుడు... నేనొస్తానంటున్న వరుణుడు