తెలంగాణ

telangana

ETV Bharat / briefs

అసలు హోలీ ఎందుకు జరుపుకుంటామంటే ?

హోలీ దేశమంతా జరుపుకునే పండుగ. చిన్న పెద్దా అందరు సంతోషంగా రంగులు చల్లుకుంటూ జరుపుకుంటారు. అసలు ఈ రోజు ఎందుకు రంగులు చల్లుకుంటాం...! ఈ పండుగ చరిత్ర.. ప్రత్యేకత తెలుసుకుందాం.

By

Published : Mar 21, 2019, 5:12 AM IST

హోలీ ఎందుకు జరుపుకుంటామంటే ?

హోలీ రంగుల కేళి... మనసంతా ఆనందాన్ని నింపే సంబురం ఈ పండుగ. చిన్న, పెద్ద, పేద, ధనిక తేడా లేకుండా అంతా స్నేహభావంతో రంగులు చల్లుకుంటారు. మనుషులంతా సమానమని చాటి చెప్పే వసంతాల వేడుక...​.మనషులంతా ఒక్కటే అనే సందేశం ఇచ్చే వేడుక హోలీ.

హోలీ అంటే అగ్ని లేదా అగ్నితో పునీతమైందని అర్థం. ప్రతి ఏటా ఫాల్గుణ మాసంలో పౌర్ణమి రోజున వచ్చే ఈ పండుగను హోలీ, కాముని పున్నమి, డోలికోత్సవం అనీ అంటారు.

ఎందుకు జరుపుకుంటామంటే?

మనషులంతా ఒక్కటే అనే సందేశం ఇచ్చే వేడుక

రాక్షస రాజు హిరణ్యకశిపుడి కుమారుడు ప్రహ్లాదుడు నిత్యం విష్ణుమూర్తిని స్మరిస్తుంటాడు. తండ్రి హిరణ్యకశిపుడికది నచ్చదు. ప్రహ్లాదుడిని ఎలాగైనా మట్టుబెట్టాలని నిర్ణయించుకుంటాడు. సోదరి హోలికను పిలిచి ఆమెకు ఉన్న శక్తితో ప్రహ్లాదుడిని మంటల్లో ఆహుతి చేయమంటాడు. అప్పుడామె ప్రహ్లాదుడిని ఒడిలో కూర్చోబెట్టుకుని మంటల్లో దూకుతుంది. విష్ణు మాయతో ప్రహ్లాదుడు ప్రాణాలతో బయటపడగా, హోలిక మాత్రం చనిపోతుంది. హోలిక దహనమైన రోజే హోలీ జరుపుకుంటామని పురాణాలు చెబుతున్నాయి. అందుకే కొన్ని ప్రాంతాల్లో రాత్రి వేళ...హోలిక దహనం నిర్వహిస్తారు.

ABOUT THE AUTHOR

...view details