తెలంగాణ

telangana

ETV Bharat / briefs

'తప్పనిసరైతేనే బయటకు రండి' - AP TS

"ఫొణి తుపాను ఎప్పుడైతే బంగ్లాదేశ్ వైపు దాటి వెళ్లిందో అప్పటి నుంచి గాలిలో తేమ శాతం తగ్గిపోయి ఎక్కువగా వడగాల్పులు వీస్తున్నాయి. మరో మూడు, నాలుగు రోజుల పాటు ఇలాగే ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంది": రాజారావు, వాతావరణ శాఖ అధికారి

'అత్యవసర పరిస్థితుల్లో తప్ప పగటిపూట బయట తిరగకండి'

By

Published : May 7, 2019, 7:16 PM IST

Updated : May 7, 2019, 7:34 PM IST

రాష్ట్రంలో గత రెండు రోజులుగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. నేడు నల్గొండ జిల్లాలో అత్యధికంగా 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కుమురం భీం-ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, సూర్యాపేట జిల్లాల్లో 44 డిగ్రీలుగా నమోదయ్యాయి. నిన్న ఖమ్మం జిల్లాలో అత్యధికంగా 46.2 డిగ్రీలకు చేరింది.

గాలిలో తేమశాతం తగ్గిపోవడం వల్లే వడగాలులు ఎక్కువగా వీస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. రాగల మూడు రోజుల వరకు ఇలాంటి వాతావరణ పరిస్థితులే ఉంటాయంటున్నారు. వీలైనంత వరకు ప్రజలు పగటి పూట బయట తిరగొద్దని అధికారులు సూచిస్తున్నారు.

'అత్యవసర పరిస్థితుల్లో తప్ప పగటిపూట బయట తిరగకండి'

ఇవీ చూడండి: ఓటర్లు లేకుండానే ఎన్నికలేంటి..?: ఉత్తమ్

Last Updated : May 7, 2019, 7:34 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details