బంగాళఖాతం నైరుతి ప్రాంతంలో ఈనెల 26న అల్పపీడనం ఏర్పడి... అనంతరం అది వాయుగుండంలా మారే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మరోవైపు ఛత్తీస్గడ్పై 1500 మీటర్ల ఎత్తున ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని నుంచి విదర్భ, మరఠ్వాడాల మీదుగా ఉత్తర కర్ణాటక వరకూ 900 మీటర్ల ఎత్తున ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. వీటి ప్రభావంతో రాష్ట్రంలో ఇవాళ అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలున్నాయి.
రాష్ట్రంలో ఇవాళ ఉరుములు, మెరుపులతో వర్షం - WEATHER REPORT
మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో వేసవి తాపం నుంచి ప్రజలు ఉపశమనం పొందుతున్నారు. మరోవైపు వడగళ్ల ప్రభావంతో లక్షల విలువైన ధాన్యం, వేల ఎకరాల్లో పంట నష్టపోయారు రైతులు. ఈరోజు కూడా గాలులు, మెరుపులు, ఉరుములతో కూడిన వాన పడుతుందని వాతావరణ శాఖ సూచిస్తోంది.
ఉపరితల ద్రోణి...
శనివారం ఉదయం 8 నుంచి ఆదివారం రాత్రి 8 గంటల వరకూ 355 ప్రాంతాల్లో ఒక మాదిరి వర్షాలు కురిశాయి. ఆదివారం పగటిపూట 96 ప్రాంతాల్లో వానలు పడ్డాయి. అత్యధికంగా రాజేంద్రనగర్లో 52.8, ఐజలో 13.5, ఎదుగులపల్లిలో 12.5, నల్లవెల్లిలో 10.5, బెల్లంపల్లిలో 11.5 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది.
ఇవీ చూడండి: సాంకేతిక సమస్యలతో ఆగిపోతున్న మెట్రో రైళ్లు
Last Updated : Apr 22, 2019, 9:03 AM IST
TAGGED:
WEATHER REPORT