శనివారం తెలంగాణలో పొడివాతావరణం ఉంటుందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉత్తర కర్ణాటక పరిసర ప్రాంతాల్లో 900 మీటర్ల ఎత్తున ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని పేర్కొన్నారు. మరోవైపు బంగాళాఖాతం వాయువ్య ప్రాంతం నుంచి తమిళనాడు మీదుగా రాయలసీమ వరకు ఉన్న ఉపరితల ద్రోణి బలహీన పడింది. ఆదివారం అక్కడక్కడ ఒక మాదిరి వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు
రేపు రాష్ట్రంలో అక్కడక్కడ చిరుజల్లులు - rain will fall
గత కొన్ని రోజులుగా సూర్యతాపంతో అల్లాడిన నగర వాసులకు ఉపశమనం లభించనుంది. రేపు రాష్ట్రంలో అక్కడక్కడ చెదురుమదురు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
రేపు రాష్ట్రంలో అక్కడక్కడ చిరుజల్లులు