తెలంగాణ

telangana

ETV Bharat / briefs

అంబానీ ఒక్క గంట సంపద= కూలీ 10వేల ఏళ్ల శ్రమ

కరోనా సంక్షోభం కారణంగా ఆర్థిక అసమానతలు ఇంకా పెరిగినట్లు ఆక్స్​ఫామ్​ నివేదిక స్పష్టం చేసింది. పేదలు నిరుపేదలుగా మారితే, ధనవంతుల సంపద లక్షల కోట్లు పెరిగినట్లు తెలిపింది. కరోనా సంక్షోభ సమయంలో ఆసియా కుబేరుడు ముకేశ్ అంబానీ ఒక్క గంటలో సంపాదించిన మొత్తాన్ని.. నైపుణ్యంలేని ఓ కార్మికుడు సంపాదించాలంటే 10వేల సంవత్సరాలు పడుతుందని నివేదిక వెల్లడించింది.

Wealth amassed by 100 richest Indians during pandemic can give 13.8 cr poorest Rs 94k each: Oxfam
అంబానీ ఒక్క గంట సంపద= కార్మికుడి 10వేల ఏళ్ల శ్రమ

By

Published : Jan 25, 2021, 1:41 PM IST

కరోనా కాలంలో పేదలు ఆకలితో అలమటిస్తే ధనవంతులు మాత్రం వారి సంపదను భారీగా పెంచుకున్నట్లు ప్రముఖ అంతర్జాతీయ సంస్థ ఆక్స్​ఫామ్​ తేటతెల్లం చేసింది. కరోనా సంక్షోభం మొదలైన గతేడాది మార్చి నుంచి ఇప్పటి వరకు భారత్​లోని టాప్ 100 సంపన్నుల సంపద రూ.12,97,822 కోట్లు పెరిగినట్లు నివేదికలో వెల్లడించింది. ఈ సంపదను దేశంలోని 13.8 కోట్లమంది పేదలకు తలా రూ.94,045 చొప్పున పంచవచ్చని తెలిపింది.

'ది ఇనీక్వాలిటీస్​ వైరస్'​ పేరుతో ప్రపంచ ఆర్థిక సదస్సు తొలిరోజున ఈ నివేదికను ఆక్స్​ఫామ్​ విడుదల చేసింది. కరోనా సంక్షోభ సమయంలో ఆసియా కుబేరుడు ముకేశ్ అంబానీ ఒక్క గంటలో సంపాదించిన మొత్తాన్ని.. నైపుణ్యంలేని ఓ కార్మికుడు సంపాదించాలంటే 10వేల సంవత్సరాలు పడుతుందని తెలిపింది. అంబానీ ఒక్క సెకన్​లో ఆర్జించిన మొత్తాన్ని ఓ కార్మికుడు పోగేసేందుకు మూడేళ్లు పడుతుందని పేర్కొంది. ప్రపంచం గత 100 ఏళ్లలో ఎదుర్కొన్న అత్యంత విపత్కర ఆరోగ్య సంక్షోభం 'కరోనా' అని నివేదిక వెల్లడించింది. 1930ల నాటి మహా మాంద్యంతో మాత్రమే ఈ ఆర్థిక సంక్షోభాన్ని పోల్చవచ్చంది.

నివేదికలోని ఇతర కీలక విషయాలు..

  • గౌతమ్​ అదానీ, శివ్​ నాడార్​, సైరస్​ పూనావాలా, ఉదయ్​ కొటాక్​, అజీం ప్రేమ్​జీ, సునీల్​ మిత్తల్​, రాధాకృష్ణ దమానీ, కేఎం బిర్లా, లక్ష్మీ మిత్తల్​ వంటి చమురు, బొగ్గు, టెలికం, ఔషధ, రిటైల్​ రంగాలకు చెందిన దిగ్గజ వ్యాపారుల సంపద లాక్​డౌన్​ ప్రకటించాక భారీగా పెరిగింది.
  • కరోనా కాలంలో అంబానీ సంపాదించిన మొత్తంతో భారత్​లోని 40కోట్ల మంది అసంఘటిత కార్మికులు పేదరికంలోకి జారుకునే ప్రమాదం లేకుండా కనీసం 5నెలల పాటు దారిద్ర్య రేఖకు ఎగువన ఉండొచ్చు.
  • లాక్​డౌన్​లో భారత్​లోని ధనవంతుల సంపద 35శాతం పెరిగింది. 2009తో పోల్చితే 90శాతం వృద్ధి చెంది 422.9 బిలియన్​ డాలర్లుకు చేరుకుంది. ఫలితంగా ప్రపంచంలో అమెరికా, చైనా, జర్మనీ, రష్యా, ఫ్రాన్స్​ తర్వాత భారత్​ ఆరో స్థానంలో నిలిచింది.
  • భారత్​లోని టాప్​-11 ధనవంతుల పెరిగిన సంపదతో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం లేదా ఆరోగ్య శాఖను 10ఏళ్ల పాటు కొనసాగించవచ్చు.
  • కరోనా కారణంగా గతేడాది ఏప్రిల్ నెలలో గంటకు 1,70,000 మంది ఉద్యోగాలు కోల్పోయారు.
  • కరోనా ప్రభావం అసంఘటిత రంగంపైనే తీవ్రంగా చూపింది. మొత్తం 12.2 కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోగా.. వారిలో అసంఘటిత రంగానికి చెందివారే 9.2 కోట్ల మంది ఉన్నారు.
  • లాక్​డౌన్​ కారణంగా అసంఘటిత రంగానికి చెందిన 300మంది మరణించారు. ఆకలి, ఆర్థిక ఇబ్బందులు, రోడ్డు, రైలు ప్రమాదాలు, వైద్యం అందకపోవడం, ప్రభుత్వాలు సరైన చర్యలు చేపట్టక పోవడమే వీరి మృతికి కారణం.
  • 2020 ఏప్రిల్​లో 1.7 కోట్ల మంది మహిళలు ఉద్యోగాలు కోల్పోయారు. మహిళా నిరుద్యోగిత రేటు లాక్​డౌన్​కు ముందుతో పోల్చితే 15శాతం పెరిగింది.

ఇదీ చూడండి: బడ్జెట్‌తో పెట్రో మంట తగ్గనుందా?

ABOUT THE AUTHOR

...view details