రాష్ట్ర వ్యాప్తంగా ప్రశాంతంగా ఎన్నికల జరిగాయని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్‌కుమార్ తెలిపారు. 34,512 ఈవీఎంలు, 34,700 వీవీప్యాట్లు ఉపయోగించామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 398 ఈవీఎంలు మాత్రమే మార్చామని వివరించారు. నిజామాబాద్ లోక్‌సభ పోలింగ్ ను గిన్నిస్ రికార్డుల్లో చేర్చాలని లేఖ రాశామని పేర్కొన్నారు. ఎన్నికల సందర్భంగా తనిఖీల్లో రూ.74.06 కోట్లు సీజ్ చేశామన్నారు. 2014 ఎన్నికలతో పోలిస్తే 3 రెట్లు ఎక్కువ నగదు పట్టుబడిందని తెలిపారు.
' గిన్నిస్ రికార్డుకు నిజామాబాద్ ఎన్నికలు'
రాష్ట్ర వ్యాప్తంగా ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్ తెలిపారు. నిజామాబాద్ పోలింగ్‌ను గిన్నిస్ రికార్డుల్లో చేర్చాలని లేఖ రాశామన్నారు. ఉద్యమ సింహం చిత్రం నిలిపివేత ఉత్తర్వులు రాత్రే మాకు వచ్చాయని తెలిపారు.
' గిన్నిస్ రికార్డుకు నిజామాబాద్ ఎన్నికలు'
ఉద్యమ సింహం చిత్రం నిలిపివేత ఉత్తర్వులు రాత్రే మాకు వచ్చాయన్నారు. దానిపై వెంటనే నిర్మాతకు సమాచారమిచ్చామని తెలిపారు. నారాయణపేట జిల్లా తీలేరులో నిన్న జరిగిన విషాద ఘటన దృష్ట్యా ఆ గ్రామస్థులు పోలింగ్‌కు దూరంగా ఉన్నారని తెలిపారు.
ఇవీ చూడండి: కేసీఆర్ కుటుంబ సభ్యులు... ఎవరెక్కడ ఓటేశారు?