తెలంగాణ

telangana

ETV Bharat / briefs

నేడే వయనాడ్​లో రాహుల్ గాంధీ నామినేషన్​ - నామినేషన్

కేరళలోని వయనాడ్​ లోక్​సభ స్థానానికి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్​గాంధీ నేడు నామినేషన్​ దాఖలు చేయనున్నారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, ఏఐసీసీ జనరల్ సెక్రటరీ ముకుల్ వాస్నిక్ కార్యక్రమానికి హాజరవుతారు. భారీ రోడ్​షోతో నామపత్రాల దాఖలుకు వెళ్తారు రాహుల్​.

గురువారం వాయనాడ్ నుంచి రాహుల్ నామినేషన్

By

Published : Apr 3, 2019, 9:20 PM IST

Updated : Apr 4, 2019, 3:09 AM IST

నేడే వయనాడ్​లో రాహుల్ నామినేషన్​
కేరళలోని వయనాడ్ లోక్​సభ స్థానానికి​ నేడు నామినేషన్​ దాఖలు చేయనున్నారు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. ఈ కార్యక్రమంలో పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ,కేరళ పార్టీ వ్యవహారాల బాధ్యుడు ముకుల్ వాస్నిక్, నేతలు కేసీ వేణుగోపాల్, ముళ్లపల్లి రామచంద్రన్ పాల్గొననున్నారు.

పార్టీ నాయకులు,కార్యకర్తలు, అభిమానులతో భారీ రోడ్​షో నిర్వహించినామినేషన్​ దాఖలు చేయనున్నారు రాహుల్​ గాంధీ.

దక్షిణాది నుంచి రాహుల్​గాంధీ పోటీ చేస్తుండటంపై రాజకీయ వర్గాల్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది. వయనాడ్​ లోక్​సభ స్థానంతోపాటు ఉత్తర్​ప్రదేశ్​లోని అమేఠీబరిలోనూ ఉన్నారు రాహుల్​.

రాహుల్ పోటీ ప్రజల్లో ఆసక్తిని రేకెత్తించిందన్నారు వాస్నిక్. దక్షిణాది నుంచి రాహుల్​ పోటీ చేయాలని కేరళతో పాటు, కర్ణాటక, తమిళనాడు నుంచివినతులు అందాయి. కానీ.. చివరకు కాంగ్రెస్​ అధ్యక్షుడు కేరళలోని వయనాడ్​నేఎంచుకున్నారు. రాహుల్​ నామినేషన్​ దృష్ట్యా వయనాడ్​, కోజికోడ్​ల​లో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Last Updated : Apr 4, 2019, 3:09 AM IST

ABOUT THE AUTHOR

...view details