తెలంగాణ

telangana

ETV Bharat / briefs

'బాహుబలి సినిమాలో నటించాలనుంది' - బాహుబలి

సన్​రైజర్స్​ ఆఫ్​ హైదరాబాద్​ జట్టు ఓపెనర్​ డేవిడ్​ వార్నర్​ అవకాశమొస్తే బాహుబలిలో నటిస్తానని తెలిపాడు. స్పందించిన చిత్రబృందం పార్ట్-3 కి సిద్ధంగా ఉండాలని ట్వీట్ చేసింది.

'బాహుబలి సినిమాలో నటించాలనుంది'

By

Published : Apr 3, 2019, 3:21 PM IST

దేశం యావత్తూ ప్రస్తుతం ఐపీఎల్​ ఫీవర్​తో ఊగిపోతోంది. కొద్దిరోజుల క్రితం ప్రారంభమైన ఈ లీగ్​లో 8 జట్లు హోరాహోరీగా తలపడుతున్నాయి. టైటిల్​ ఫేవరెట్లలో సన్​రైజర్స్ హైదరాబాద్ ఒకటి. ఓపెనర్ వార్నర్ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు.

ఓ ప్రమోషనల్ ఇంటర్వూలో భాగంగా జట్టు సభ్యుడు వార్నర్ చెప్పిన ఓ సమాధానం ఆకట్టుకుంది. బాహుబలి సినిమాలో నటించాలని ఉందంటూ తన మనసులో మాటను బయటపెట్టాడు ఈ డాషింగ్​ ఓపెనర్​. భారతీయులే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రానికి అభిమానులున్నారని ఈ సమాధానం మరోసారి నిరూపించింది.

ఈ విషయంపై వెంటనే సమాధానమిచ్చింది బాహుబలి చిత్రబృందం. "ఎవరి పక్కన నిలుస్తారు.. బాహు లేదా భల్లా?? బాహుబలి- 3కి సిద్ధంగా ఉండండి" అంటూ రీట్వీట్ చేసింది. ఐపీఎల్​ మిగతా మ్యాచ్​ల్లో బాగా ఆడాలని శుభాకాంక్షలు తెలిపింది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details