తెలంగాణ

telangana

ETV Bharat / briefs

'కేసీఆర్​ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తా' - వరంగల్​ ఎంపీ దయాకర్​

తనపై నమ్మకం ఉంచి రెండోసారి ఎంపీగా గెలిపించిన ప్రజలకు వరంగల్​ ఎంపీ పసునూరి దయాకర్​ కృతజ్ఞతలు తెలిపారు. కేసీఆర్​ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తామని అన్నారు. వరంగల్​ నగరాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తానని పేర్కొన్నారు.

పసునూరి దయాకర్​

By

Published : Jun 18, 2019, 8:00 PM IST

వరంగల్​ నగరాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయడమే తమ ముందున్న లక్ష్యమని వరంగల్​ ఎంపీ పసునూరి దయాకర్​ అన్నారు. దిల్లీలోని పార్లమెంటులో ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం మాట్లాడిన ఆయన తనపై నమ్మకం ఉంచి గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్​ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తామని పేర్కొన్నారు. టెక్స్​టైల్​ పార్కు, రింగురోడ్డు నిర్మాణాలు పూర్తయ్యేలా చర్యలు చేపడతామని అన్నారు. కేంద్రం నుంచి అధిక నిధులు వచ్చేలా పోరాడతామని స్పష్టం చేశారు.

వరంగల్​ అభివృద్ధే లక్ష్యం అంటున్న పసునూరి దయాకర్​

ABOUT THE AUTHOR

...view details