పార్లమెంట్లో ప్రజా సమస్యలపై గళమెత్తె గొంతు కావాలా? వేల కోట్లు సంపాదించడానికి పోటీ చేస్తున్న ధనవంతుడు కావాలా అని ప్రశ్నించారు మహబూబ్‌నగర్ ఎంపీ అభ్యర్థి వంశీచంద్‌రెడ్డి. నియోజకవర్గ పరిధిలోని బాలానగర్, రాజాపూర్ మండలాల్లో మల్లురవితో కలిసి రోడ్‌షోలు నిర్వహించారు. భాజపా అభ్యర్థులకు ఓటేస్తే వృథా అవుతుందని సూచించారు. తెరాస అభ్యర్థులను గెలిపిస్తే తిరిగి కమలం పార్టీకే మద్దతిస్తారన్నారు. తాను విజయం సాధిస్తే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా కోసం పోరాటం చేస్తానని హామీ ఇచ్చారు.
పార్లమెంట్లో ప్రజా సమస్యలపై గళమెత్తుతా.. - loksaba
లోక్‌సభలో పాలమూరు ప్రజాగొంతుకనవుతానన్నారు మహబూబ్‌నగర్ ఎంపీ అభ్యర్థి వంశీచంద్ రెడ్డి. భాజపా, తెరాసలకు ఓటేస్తే వృథా అవుతుందని తెలిపారు. నాగర్‌కర్నూల్ పార్లమెంట్ అభ్యర్థి మల్లురవితో కలిసి ప్రచారం నిర్వహించారు.
వంశీచంద్ రెడ్డి ప్రచారం