తెలంగాణ

telangana

ETV Bharat / briefs

వియారెజియా...అందాలు చూద్దామయా! - రాజకీయ నేతలు

ఇటలీలోని వియారెజియా నగరంలో ప్రతిఏటా జరిగే శీతకాల కార్నివాల్​ను కన్నుల పండువగా నిర్వహించారు.

Breaking News

By

Published : Feb 13, 2019, 7:07 AM IST

వియారెజియా...అందాలు చూద్దామయా!
ఇటాలియన్ నగరం వియారెజియోలో ఏటా జరిగే కార్నివాల్​ను కన్నుల పండువగా జరిపారు. ప్రతి సంవత్సరం ఏదో ఒక ఇతివృత్తంతో రూపొందుతుందీ పరేడ్​. ఈ ఏడు అంతర్జాతీయ రాజకీయ నేతలు, సామాజిక, పర్యావరణ అంశాల నేపథ్యంగా నిర్వహించారు.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్​ ప్రతిమను చక్రవర్తిగా రూపొందించారు. ఆయన ఆయుధంపై ట్విట్టర్ చిత్రాల్ని ఉంచారు.

మరో బొమ్మలో రెండు హైనాలు ఓ పుస్తకాన్ని చీల్చుకుని దాడికి సిద్ధమైనట్లుగా తయారు చేశారు. పర్యావరణ సంరక్షణ ఇతివృత్తంగా... ఓ వేల్స్​​ చేప ప్లాస్టిక్​లో ఈదుతున్నట్లుగా, ప్రకృతి ఓ యాపిల్​తో విషతుల్యమైనట్లుగా రూపొందించారు.

ఈ ఏడు పరేడ్​లో మహిళా ప్రముఖులకు ప్రాధాన్యత కల్పించారు. ప్రతి ఏటా అట్టహాసంగా జరిగే ఈ కార్యక్రమం 1873- శీతాకాలంలో ప్రారంభమైంది.

ABOUT THE AUTHOR

...view details