తెలంగాణ

telangana

ETV Bharat / briefs

'కాపలాదారుడి లాఠీకి భయపడుతున్నారా?' - పీఎం నరేంద్ర మోదీ

'పీఎం నరేంద్ర మోదీ' సినిమాను వివాదాస్పదం చేయడాన్ని నటుడు వివేక్​ ఒబెరాయ్​ తప్పుబట్టాడు. ఇది స్ఫూర్తిదాయక చిత్రమని, దేశానికి మోదీ పెద్ద హీరో అని ఒబెరాయ్​ అన్నాడు.

'కాపలాదారుడి లాఠీకి భయపడుతున్నారా?'

By

Published : Apr 3, 2019, 5:32 PM IST

ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై బాలీవుడ్​ నటుడు వివేక్​ ఒబెరాయ్​ ప్రశంసల వర్షం కురిపించాడు. భారతీయులకు మోదీనే అతి పెద్ద హీరోనని ఒబెరాయ్​ అన్నాడు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం 'పీఎం నరేంద్ర మోదీ.' ఈ చిత్రంలో మోదీ పాత్రను వివేక్​ ఒబెరాయ్​ పోషించాడు. నిజ జీవితంలోనే పెద్ద హీరో అయిన మోదీని సినిమాలో ప్రత్యేకంగా హీరోగా చూపించాల్సిన అవసరం లేదన్నాడు. ఒక స్ఫూర్తిదాయక చిత్రాన్ని ప్రేక్షకులకు అందిస్తున్నందుకు సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేశాడు ఒబెరాయ్​.

'పీఎం నరేంద్ర మోదీ' చిత్రం వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో సినిమా విడుదలను అడ్డుకోవాలని పలువురు కోర్టును ఆశ్రయించారు. ఈ విషయంపై స్పందించిన ఒబెరాయ్​... పిల్​ దాఖలు చేసిన వారు సినిమాకు భయపడుతున్నారా లేక కాపలాదారుడి లాఠీకి భయపడుతున్నారా అంటూ ఎద్దేవా చేశాడు.

'కాపలాదారుడి లాఠీకి భయపడుతున్నారా?'

"అభిషేక్​ సింఘ్వీ, కపిల్​ సిబల్​ గొప్ప న్యాయవాదులు. ఇంత చిన్న సినిమాను అడ్డుకోవడానికి ప్రయత్నించి సమయం ఎందుకు వృధా చేసుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు. మీ మీద మీకంత నమ్మకం ఉంటే, మీరు గొప్ప పనులు చేశారనుకుంటే... మీ పనుల మీద నమ్మకం పెట్టుకోవచ్చు కదా. ఒక సినిమా గురించి ఎందుకు భయపడుతున్నారు? మరి సినిమా గురించి భయపడుతున్నారో లేక కాపలాదారుడి లాఠీకి భయపడుతున్నారో అర్థం కావట్లేదు"
-వివేక్ ఒబెరాయ్, నటుడు

'పీఎం నరేంద్ర మోదీ' చిత్రం ఏప్రిల్​ 6న విడుదల కానుంది.

ABOUT THE AUTHOR

...view details