అనుమానంతో మాటలు...
వికారాబాద్ జిల్లా తాండూర్ ప్రాంతానికి చెందిన రాజశేఖర్, పుష్పలత(24)కు నాలుగు సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. బతుకు దెరువు కోసం మూడు నెలల క్రితం నిజాంపేట గ్రామానికి వలస వచ్చారు. కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్‌లోని మంజీరా షాపింగ్ మాల్లో సెక్యురిటీగా రాజశేఖర్, హౌస్ కీపింగ్‌గా పుష్పలత పని చేస్తున్నారు. భార్యభర్తలు తరుచూ గొడవ పడేవారు. ఎప్పుడూ తన ఫోన్లో నెంబర్లు తనిఖీ చేస్తూండేవాడని... అనుమానంతో వేధించేవాడని గోడపై పుష్పలత రాసింది. భర్త వేధింపులకు తోడు అత్త సూటిపోటి మాటలు కూడా తోడవటం వల్ల తీవ్ర మనస్తాపానికి గురై తనువు చాలిస్తున్నట్లు రాసుకొచ్చింది పుష్పలత.