కోలీవుడ్ హీరోలు విశాల్, ఆర్య కలిసి ఓ మల్టీస్టారర్ సినిమాలో నటిస్తున్నారు. తాజాగా ఆ చిత్రానికి సంబంధించిన టైటిల్‌ను 'ఎనిమీ'గా ప్రకటించింది చిత్రబృందం. దీనికి సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేసింది. ఇందులో హీరోలిద్దరూ సీరియస్ లుక్‌లో కనిపించి ఆకట్టుకున్నారు.
విశాల్ శత్రువుగా ఆర్య- మల్టీస్టారర్ టైటిల్ ఖరారు - విశాల్ ఆర్య సినిమాకు టైటిల్ ఖరారు
తమిళ హీరోలు విశాల్, ఆర్య కలిసి నటిస్తోన్న సినిమా టైటిల్‌ను 'ఎనిమీ'గా ఖరారు చేసింది చిత్రబృందం. దీనికి సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ సినిమాకు ఆనంద్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు.
![విశాల్ శత్రువుగా ఆర్య- మల్టీస్టారర్ టైటిల్ ఖరారు VISHAL](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9663677-340-9663677-1606310587809.jpg)
విశాల్, ఆర్య
ఈ సినిమాకు ఆనంద్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. మినీ స్టూడియోస్ పతాకంపై వినోద్ కుమార్ నిర్మిస్తున్నారు. తమన్ సంగీత దర్శకుడు. ఇతర తారాగణం వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు. విశాల్‌కు ఇది 30వ చిత్రం, ఆర్యకు 32వ సినిమా. గతంలో వీరిద్దరూ బాలా దర్శకత్వం వహించిన 'వాడు వీడు'లో కలిసి నటించి, మెప్పించారు. మరి ఈసారి ఎలా అలరిస్తారో చూడాలి?
ఇదీ చూడండి :రామోజీ ఫిల్మ్‌సిటీలో విశాల్-ఆర్య సినిమా
Last Updated : Nov 25, 2020, 9:41 PM IST