విజయవంతంగా నింగిలోకి పీఎస్‌ఎల్‌వీ-సీ45 - LAUNCH
పీఎస్‌ఎల్‌వీ-సీ45 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఉదయం 9.27గంటలకు నింగిలోకి దూసుకెళ్లింది. 4 స్ట్రాపాన్ బూస్టర్లతో శాస్త్రవేత్తలు తొలిసారి ఈ ప్రయోగం నిర్వహించారు. డీఆర్‌డీవోకు చెందిన ఇమిశాట్‌తో పాటు మరో 28 విదేశీ ఉపగ్రహాలను 3వేర్వేరు కక్ష్యల్లో ప్రవేశపెట్టింది.
పీఎస్‌ఎల్‌వీ-సీ45 ప్రయోగం సఫలం
అమెరికాకు చెందిన 20 భూపరిశీలన నానో ఉపగ్రహాలు, లిథువేనియాకు చెందిన 2, స్విట్జర్లాండ్, స్పెయిన్‌కు చెందిన ఉపగ్రహాలను రోదసీలో 504 కిలోమీటర్ల ఎత్తులో విడిచిపెట్టారు. తర్వాత దశల్లో'పీఎస్-4'ను మూడోకక్ష్యలోకి ప్రవేశపెట్టనుంది.ఈ దశలో ఇస్రో రూపొందించిన ఆటోమేటిక్ ఐడింటికేషన్ సిస్టమ్.... ఓడల కదలికలపై సమాచారం ఇవ్వనుంది.రేడియో అమెచ్యూర్ శాటిలైట్ కార్పొరేషన్ రూపొందించిన ఆటోమేటిక్ పాకెట్ రిపేరింగ్ సిస్టమ్..... రేడియో తరంగాల సమాచారాన్ని తెలపనుంది.