తెలంగాణ

telangana

ETV Bharat / briefs

తెరాసకు ప్రజలే బుద్ధి చెబుతారు: విజయ శాంతి - కేసీఆర్​పై విజయశాంత్రి ఆగ్రహం

తెరాస రాజ్యాంగ వ్యతిరేక చర్యలకు పాల్పడుతోందని కాంగ్రెస్​ నాయకురాలు విజయశాంతి మండిపడ్డారు. సీఎల్పీ విలీనాన్ని నిరసిస్తూ భట్టి చేస్తున్న ఆమరణ దీక్షపై యావత్​ తెలంగాణ చర్చించుకుంటుందన్నారు. ప్రజలే తెరాసకు తగిన బుద్ధి చెబుతారని అభిప్రాయపడ్డారు.

తెరాసకు ప్రజలే బుద్ది చెబుతారు

By

Published : Jun 10, 2019, 5:24 AM IST

Updated : Jun 10, 2019, 10:05 AM IST

తెరాసకు ప్రజలే బుద్ది చెబుతారు

సీఎల్పీ విలీనంపై విజయశాంతి మండిపడ్డారు. రాజ్యాంగం ప్రకారం వచ్చిన ప్రతిపక్ష హోదాను లాక్కున్నారని ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం భట్టి విక్రమార్క చేస్తున్న ఆమరణ దీక్ష కొత్త చర్చకు దారితీసిందన్నారు. ఎప్పటికి తామే అధికారంలో ఉండాలనే దురుద్దేశంతో తెరాస వరుస తప్పులు చేస్తోందని విజయ శాంతి విమర్శించారు. మంది బలంతో తాము ఏం చేసినా చెల్లుబాటవుతోందనే.. బరితెగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిన ప్రతి సందర్భంలో ఇతర వ్యవస్థలు తమ వంతు పాత్ర పోషించినా.. లేకపోయినా.. తగిన సమయంలో ప్రజలే బుద్ధి చెబుతారన్నారు.

ఇటీవల ఏపీ ముఖ్యమంత్రి జగన్​ చేసిన వ్యాఖ్యలు గుర్తుకొస్తున్నాయని.. 'వైకాపా ఎమ్మెల్యేలను అన్యాయంగా తెదేపాలో చేర్చుకుని చంద్రబాబు సంబుర పడ్డారని.. అనంతరం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలయ్యారని' తెలిపారు. తెలంగాణలోనూ అటువంటి పరిస్థితి వస్తుందని విజయ శాంతి అభిప్రాయపడ్డారు.

ఇవీ చూడండి: సీఎల్పీ విలీనం దుర్మార్గం: కోమటిరెడ్డి

Last Updated : Jun 10, 2019, 10:05 AM IST

ABOUT THE AUTHOR

...view details