తెలంగాణ

telangana

ETV Bharat / briefs

'కేసీఆర్​, మోదీకి మోసం చేయడం బాగా అలవాటైంది' - congress

గులాబీ, కమలం పార్టీలు ప్రజలను ఎలా మోసం చేస్తున్నాయో ప్రచారంలో వివరిస్తున్నామన్నారు కాంగ్రెస్​ ప్రచార కమిటీ ఛైర్​పర్సన్​ విజయశాంతి. రాములమ్మ ఎక్కడికెళ్లినా స్పందన బాగుంటుందని.. హస్తం పార్టీపై ప్రజలకు గౌరవం ఉందని ఆమె అన్నారు.

vijayashanthi

By

Published : Mar 29, 2019, 4:31 PM IST

విజయశాంతితో ఈటీవీ భారత్​ ముఖాముఖి
కేసీఆర్​, మోదీలకు మోసం చేయడం బాగా అలవాటైందని కాంగ్రెస్​ ప్రచార కమిటీ ఛైర్​పర్సన్​ విజయశాంతి అన్నారు. సీఎం, ప్రధాని ఇద్దరు తోడుదొంగలేనని విమర్శించారు. కారెక్కిన హస్తం నాయకులపై తీవ్రంగా ధ్వజమెత్తారు. డబ్బు ఆశజూపిలాక్కున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్​ ప్రచారం సాఫీగా జరుగుతోందని.. భాజపా, తెరాస ప్రజలను ఎలా మోసం చేస్తున్నాయో వివరిస్తున్నామన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే రాహుల్​ గాంధీ ప్రధాని కావాలని రాములమ్మ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details