తెలంగాణ

telangana

ETV Bharat / briefs

మోదీ జీరో... రాహుల్ గాంధీ​ హీరో: విజయశాంతి

పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న వేళ... అన్ని పార్టీలు ప్రచారపర్వంలో మునిగిపోయాయి. కాంగ్రెస్​ పార్టీ స్టార్​ క్యాంపెయినర్​ విజయశాంతి పెద్దపల్లి జిల్లా ధర్మారంలో రోడ్డుషో నిర్వహించారు. మోదీ, కేసీఆర్​లపై రాములమ్మ విరుచుకుపడ్డారు.

మోదీ జీరో... రాహుల్ గాంధీ​ హీరో

By

Published : Apr 3, 2019, 4:05 PM IST

మోదీ జీరో... రాహుల్ గాంధీ​ హీరో
కేసీఆర్​కు ఓటేస్తే... మోదీకి వేసినట్లేనని పెద్దపల్లి జిల్లాధర్మారం రోడ్​షోలో పాల్గొన్న కాంగ్రెస్​ నేత విజయశాంతి పేర్కొన్నారు. మోదీ స్వచ్ఛభారత్​ అంటూ దేశంలోని నగదును ఊడ్చి వేసి నీరవ్​మోదీ లాంటి మోసగాళ్లకు ఇచ్చి దేశం దాటించారని ఆరోపించారు. మోదీ తర్వాత లక్ష్యం... మహిళల బంగారం తీసుకోవడమేనని వెల్లడించారు. దశాబ్దాల క్రితం కొన్న బంగారానికి కూడా బిల్లులు చూపించాలని మోదీ అడుగుతారని అభిప్రాయం వ్యక్తం చేశారు. సంపన్నుల కోసం మోదీ ప్రభుత్వం ఉంటే... పేద ప్రజలకు కోసం కాంగ్రెస్​ పార్టీ మాత్రమే ఉందని అన్నారు. అందుకే మోదీ జీరో... రాహుల్​ గాంధీ హీరో అని వ్యాఖ్యానించారు.

ABOUT THE AUTHOR

...view details