తెలంగాణ

telangana

ETV Bharat / briefs

బాహుబలితో సితార... టాక్సీవాలాతో ఆద్య... - ఆద్య పవన్ కల్యాణ్

పవన్​ కల్యాణ్ కూతురు ఆద్య.. విజయదేవరకొండ నటించిన 'టాక్సీవాలా' సినిమాలోని పాట పాడి అలరించింది. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవుతోంది.

రౌడీ హీరో పాట పాడి అలరించిన పవన్ కల్యాణ్ కూతురు ఆద్య

By

Published : Mar 21, 2019, 10:23 AM IST

సెలబ్రిటీలే కాదు వారి పిల్లలు కూడా ఏం చేసినా వైరల్ అవుతున్నాయి. ఇటీవల మహేశ్ బాబు ముద్దుల తనయ సితార.. 'బాహుబలి' పాటకు నర్తిస్తే, తాజాగా పవన్​కల్యాణ్ కూతురు ఆద్య.. 'టాక్సీవాలా' చిత్రంలోని 'మాటే వినదుగ' పాటను ఆలపించి అలరించింది.

ఈ వీడియోను పవన్​కల్యాణ్ కుమారుడు అకిరా.. సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నాడు. పవన్‌ గారాల పట్టి ఇలా రౌడీ హీరో పాటను వినసొంపుగా ఆలపిస్తుండటం ఆయన అభిమానులతో పాటు దేవరకొండ ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకర్షిస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌ అవుతోంది.


ABOUT THE AUTHOR

...view details