టాలీవుడ్లో సంచలన విజయం సాధించిన సినిమా 'అర్జున్ రెడ్డి'. చిన్న కథానాయకుడు విజయ్ దేవరకొండను స్టార్ హీరోను చేసింది. ఈ చిత్రాన్ని ప్రస్తుతం తమిళం, హిందీ భాషల్లో రీమేక్ చేస్తున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ 'అర్జున్' విజయ్, బాలీవుడ్ 'ప్రీతి' కియారాతో దిగిన ఫొటోలు నెట్టింట వైరల్గా మారాయి. సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తున్నాయి.
తెలుగు అర్జున్ రెడ్డి చిత్రాన్ని తెరకెక్కించిన సందీప్ రెడ్డి వంగా... హిందీ సినిమా 'కబీర్ సింగ్'ను రూపొందిస్తున్నాడు. షాహిద్ కపూర్, కియారా అద్వానీ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు.