తెలంగాణ

telangana

బీఎస్పీ అధినేత్రి మాయావతి బయోపిక్​లో విద్యాబాలన్

By

Published : Mar 28, 2019, 10:47 PM IST

Updated : Mar 29, 2019, 6:02 AM IST

ఇటీవలే వచ్చిన ఎన్టీఆర్ బయోపిక్​లో బసవతారకంగా నటించిన విద్యాబాలన్.. త్వరలో తెరకెక్కబోయే బీఎస్పీ అధినేత్రి మాయవతి బయోపిక్​లో నటించనుంది.

మాయవతిగా విద్యాబాలన్

ఎన్టీఆర్, జయలలిత, మన్మోహన్‌ సింగ్, ప్రధాని మోదీ, బాల్‌ ఠాక్రే వంటి నాయకుల జీవితకథలు బయోపిక్స్​గా తెరకెక్కించారు. ఈ జాబితాలో మరో నాయకురాలి బయోపిక్‌ చేరింది. తెలుగులో వచ్చిన నందమూరి తారక రామారావు బయెపిక్‌ రెండు భాగాల్లోనూ ఎన్టీఆర్​ సతీమణి బసవతారకం పాత్రలో నటించి మెప్పించింది విద్యాబాలన్‌. ఇప్పుడు బీఎస్పీ అధినేత్రి మాయావతి పాత్రలో కనిపించబోతుంది.

బహుజన సమాజ్‌ పార్టీ అధ్యక్షురాలు, ఉత్తరప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి మాయావతి బయోపిక్‌ త్వరలో రానుంది. ఈ సినిమాకు సుభాష్‌ కపూర్‌ దర్శకత్వం వహించనున్నారని సమాచారం.

విద్యాబాలన్‌ ఇప్పటికే ఓ వెబ్‌ సిరీస్‌లోమాజీ ప్రధాని ఇందిరాగాంధీ పాత్రలో నటిస్తున్నారు

ఇవీ చదవండి:

Last Updated : Mar 29, 2019, 6:02 AM IST

ABOUT THE AUTHOR

...view details