తెలంగాణ

telangana

ETV Bharat / briefs

"అంబేడ్కర్​ విగ్రహాన్ని అప్పగించండి.." - అంబేడ్కర్​ విగ్రహాన్ని అప్పగించండి

సాయంత్రంలోగా అంబేడ్కర్​ విగ్రహాన్ని అప్పగించాలని వీహెచ్​ డిమాండ్​ చేశారు. లేకుంటే వైఎస్సార్​ విగ్రహాలను కూల్చివేస్తామని ఆయన హెచ్చరించారు.

అంబేడ్కర్​ విగ్రహాన్ని అప్పగించండి

By

Published : Jun 18, 2019, 10:13 AM IST

సాయంత్రంలోగా అంబేడ్కర్ విగ్రహాన్ని తమకు అప్పగించకపోతే నగరంలో ఉన్న వైఎస్సార్ విగ్రహాలను కూల్చి వేస్తామని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంత రావు హెచ్చరించారు. ఈరోజు ఉదయం పంజాగుట్టలో అంబేడ్కర్ విగ్రహాన్ని ప్రతిష్టించడానికి వెళ్లిన వీహెచ్​ను పోలీసులు అడ్డుకుని అరెస్టు చేసి బొల్లారం పీఎస్ కు తరలించారు. మొన్నటి వరకు ఎన్నికల కోడ్ పేరుతో విగ్రహాన్ని పెట్టకుండా అడ్డుకున్నారని.. ఇప్పుడు కోడ్​ అమల్లో లేనప్పటికీ పోలీసులు ఓవరాక్షన్ చేస్తున్నారని వీహెచ్ మండిపడ్డారు. ప్రభుత్వం వెంటనే అంబేడ్కర్ విగ్రహాన్ని ప్రతిష్టించే విధంగా సహకరించాలని డిమాండ్ చేశారు. పోలీసులు, ప్రభుత్వ తీరు మారకుంటే ఆందోళన తీవ్రతరం చేస్తామని వీహెచ్​ హెచ్చరించారు.

అంబేడ్కర్​ విగ్రహాన్ని అప్పగించండి

ABOUT THE AUTHOR

...view details