విక్టరీ వెంకటేష్ ఇంట పెళ్లి బాజా మోగింది. వెంకీ కూతురు ఆశ్రిత వివాహం జయపురలో ఆదివారం జరగనుంది. దగ్గుబాటి కుటుంబం నుంచి ప్రకటన రానప్పటికీ పెళ్లికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.
వెంకీ కుమార్తె ఆశ్రిత ప్రీ వెడ్డింగ్‌లో తారల సందడి - వెంకటేశ్ కుమార్తె పెళ్లి వేడుకలు
టాలీవుడ్ సీనియర్ హీరో వెంకటేశ్ ఇంటిలో పెళ్లి సందడి మొదలైంది. వెంకీ కూతురు ఆశ్రిత వివాహం ప్రముఖ వ్యాపారవేత్త సురేందర్ రెడ్డి మనవడితో ఆదివారం జరగనుంది.
వెంకటేశ్ కుమార్తె ప్రీ వెడ్డింగ్..తారలు సందడి
హైదరాబాద్ రేస్ క్లబ్ ఛైర్మన్ సురేందర్ రెడ్డి మనవడు వినాయక్ రెడ్డితో ఆశ్రిత పెళ్లి జరగబోతుంది. రాజస్థాన్‌లోని జయపురలో ఈ వేడుక నిర్వహించనున్నారు. తాజాగా అక్కడే ప్రీ వెడ్డింగ్ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ హాజరయ్యాడు.
ఆదివారం నిర్వహించబోయే పెళ్లి కోసం నాగచైతన్య, సమంత, రానా తదితరులు నృత్య ప్రదర్శన ఇవ్వబోతున్నారని సమాచారం. ఇతర టాలీవుడ్ ప్రముఖులు ఈ పెళ్లికి రానున్నారు.