కృత్రిమ మేథస్సు ప్రభుత్వ, ప్రైవేటు రంగాల అభివృద్ధికి సాయపడుతుందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. హైదరాబాద్ యూనివర్సిటీలో ప్రసంగిస్తూ... పేదరికం, అసమానతలు, అత్యాచారాలు సవాళ్లు విసురుతున్నాయని తెలిపారు. సాంకేతిక రంగంలో సైబర్ సెక్యూరిటీ, డాటా ప్రైవేసీపై అందరికీ సరైన అవగాహన ఉండాలన్నారు. హైదరాబాద్ యూనివర్సిటీ దేశంలోనే ప్రముఖ విశ్వవిద్యాలయంగా పేరుగాంచిందని అది తెలంగాణ రాష్ట్ర గౌరవమని పేర్కొన్నారు.
"మార్పును స్వాగతించాలి.. సవాళ్లను స్వీకరించాలి" - ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
మానవ వనరుల్ని వాడుకోవడంలో కృత్రిమ మేథస్సు దోహదపడుతుందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. సమాజంలో వస్తోన్న మార్పులను స్వాగతిస్తూ.. సవాళ్లు స్వీకరించాలని తెలిపారు.
!["మార్పును స్వాగతించాలి.. సవాళ్లను స్వీకరించాలి"](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3485889-1032-3485889-1559808721809.jpg)
"మార్పును స్వాగతించాలి.. సవాళ్లను స్వీకరించాలి"
"మార్పును స్వాగతించాలి.. సవాళ్లను స్వీకరించాలి"
ఇదీ చూడండి : శుభవార్త: వడ్డీ రేట్లు తగ్గించిన ఆర్బీఐ