శాస్త్రవేత్తలు చేసే పరిశోధనలు జీవన వికాసానికి తోడ్పడాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా గాదంకి జాతీయ వాతావరణ పరిశోధన సంస్థను ఆయన సందర్శించారు. డేటా కేంద్రం, ఎంఎస్టీ రాడార్, హెచ్ఎఫ్ రాడార్లను పరిశీలించారు. సంస్థలో పరిశోధనలు చేసి వాతావరణ వివరాలు తెలపడం సంతోషకరమని వెంకయ్య నాయుడు తెలిపారు. భూతాపం, వాతావరణ మార్పులు గమనిస్తూ పరిష్కార మార్గాలు అన్వేషించాలని సూచించారు. ప్రతి ఒక్కరి జీవితంలో నేర్చుకోవడం భాగం కావాలన్నారు. నిరంతరం ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉండాలని వెంకయ్యనాయుడు అన్నారు.
'నిత్యం ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉండాలి' - venkaiah naidu speech
నేర్చుకోవడం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో భాగమనీ.. అందరూ నిరంతరం ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉండాలని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా గాదంకిలో జాతీయ వాతావరణ పరిశోధన సంస్థను ఆయన సందర్శించారు.

మాట్లాడుతున్న వెంకయ్యనాయుడు